Kapil Dev : నేనే బీసీసీఐ అధ్యక్షుడినైతే.. టీమ్‌ఇండియా వద్ద ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ ఉండేది : కపిల్‌

వన్డే ప్రపంచకప్‌(ODI world cup 2023)లో టీమ్‌ఇండియా షెడ్యూల్‌పై మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌(Kapil Dev) అసంతృప్తి వ్యక్తం చేశాడు. బీసీసీఐపై విమర్శలు గుప్పించాడు.

Updated : 01 Aug 2023 14:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీమ్‌ఇండియా(Team India) చేస్తున్న ప్రయోగాలు బెడిసికొడుతున్నాయి. సీనియర్లకు విశ్రాంతినిచ్చి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో భారీగా మార్పులు చేయడంతో.. విండీస్‌తో రెండో వన్డేలో ఘోర ఓటమిని చవిచూసింది. మరోవైపు  ఈ ఏడాది అక్టోబర్‌లో భారత్‌ వేదికగా వన్డే ప్రపంచకప్‌(ODI world cup 2023) జరగనున్న నేపథ్యంలో.. టీమ్‌ఇండియా ప్రదర్శనపై విమర్శలు గుప్పించిన మాజీ దిగ్గజం కపిల్‌ దేవ్‌(Kapil Dev).. బీసీసీఐపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

రోహిత్‌ సేన ఈ ప్రపంచకప్‌లో ఉత్తమ ప్రదర్శన చేసి టీమ్‌ఇండియా పదేళ్లుగా ఎదురుచూస్తున్న ఐసీసీ(ICC) ట్రోఫీ కొరతను తీర్చాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే.. బీసీసీఐ ఈ మెగా టోర్నీ కోసం కఠిన షెడ్యూల్‌ను రూపొందించిందని కపిల్‌ విమర్శించాడు.

అలా చేసినా నష్టం లేదు.. ఇక్కడెవరికీ గర్వం లేదు

‘మీరు బాగా చేసినప్పుడు దాన్ని సరైన బోర్డని అంటారు. అలాగే సరైన బోర్డు కూడా మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇక వరల్డ్‌ కప్‌ షెడ్యూల్‌ చూస్తే.. భారత్‌ 11 మ్యాచ్‌లు ఆడనుంది. ఈ షెడ్యూల్‌ ప్రకారం టీమ్‌ఇండియా ఎక్కువగా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. అసలు దీన్ని ఎవరు రూపొందించారు? ధర్మశాలకు వెళ్లాలి, ఆ తర్వాత బెంగళూరు.. దాని తర్వాత కోల్‌కతా.. ఇలా తొమ్మిది వేర్వేరు ప్రదేశాల్లో భారత్‌ ఆడనుంది. దీని గురించి నన్ను ఒకరు ఆడిగారు. ‘నేనే బీసీసీఐ అధ్యుక్షుడినైతే.. నా టీమ్‌కు ఛార్టర్డ్‌ ఫ్లైట్‌ ఉండేది’ అని చెప్పాను. మైదానంలో వారు అత్యుత్తమ ప్రదర్శన చేయాలని కోరుకుంటున్నాను. ఇవి బోర్డు చేయాల్సిన పనులు’ అంటూ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు కపిల్‌.

ఇక వన్డే ప్రపంచకప్‌ మహా సమరం అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానుండగా.. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను 8న చెన్నైలో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు