Rohit on Retirement: అప్పటి వరకూ ఆడాలని ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

గతేడాది టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత నుంచి రోహిత్ శర్మ (Rohit Sharma) పొట్టి ఫార్మాట్‌లో ఆడలేదు. వన్డే ప్రపంచకప్‌ ఉండటంతో దానిపై శ్రద్ధ పెడుతూ వచ్చాడు. దీంతో మెగా టోర్నీ ముగిశాక ఆటకు వీడ్కోలు పలుకుతాడనే వార్తలు వస్తున్నాయి. తాజాగా వాటికి చెక్‌పెడుతూ రోహిత్ స్పందించాడు.

Updated : 06 Aug 2023 15:07 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత కెప్టెన్‌ రోహిత్ శర్మ (Rohit Sharma) వెస్టిండీస్‌ పర్యటనలో ఉన్నాడు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో (WI vs IND) రోహిత్ ఆడటం లేదు. అతడి స్థానంలో హార్దిక్‌ పాండ్య (Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. గత కొన్ని రోజులుగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్‌ ఆడని విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ అనంతరం రోహిత్ శర్మ రిటైర్‌మెంట్‌ తీసుకుంటాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, తాజాగా అమెరికాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. క్రికెట్‌కు వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 

ఐపీఎల్‌లో విరాట్ - గంభీర్‌ ఎపిసోడ్‌.. దూకుడు ఎప్పుడూ మంచిదే

‘‘వచ్చే ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచకప్‌ వెస్టిండీస్‌ / అమెరికా వేదికలుగా జరగనుంది. ఇక్కడకు రావడానికి కూడా అదే కారణం. ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారని ఆశిస్తున్నా. నాక్కూడా కూడా బరిలోకి దిగాలని ఉంది’’ అని వ్యాఖ్యానించాడు. దీంతో పొట్టి కప్‌ మెగా టోర్నీలో రోహిత్ శర్మ ఆడే అవకాశాలూ ఉన్నట్లు అభిమానులు నెట్టింట కామెంట్లు కురిపిస్తున్నారు. 

సీనియర్లు లేకుండానే ఆడారు: ముకుంద్

‘‘వెస్టిండీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోవడంపై చాలామంది అతిగా స్పందిస్తున్నారు. కానీ, ఇక్కడ కీలకమైన విషయం మరొకటి ఉంది. యువకులతో కూడిన జట్టు హార్డ్‌ హిట్టర్లు ఉన్న విండీస్‌తో తలపడింది. రోహిత్, విరాట్, జడేజా, బుమ్రా, షమీ లేకుండా ఆడారు. కాబట్టి, ఇందులో కంగారు పడాల్సిన అవసరమేమీ లేదు. టీమ్‌ఇండియా ఆడిన విధానం బాగుంది. చివర్లో కొన్ని తప్పులు చేయడంతో ఓటమి చవిచూశారు. తప్పకుండా  వాటి నుంచి నేర్చుకుని విజయాలు నమోదు చేస్తుంది’’ అని సీనియర్‌ ఆటగాడు అభినవ్‌ ముకుంద్‌ వ్యాఖ్యానించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని