Suryakumar Yadav: ఆ రికార్డుకు మూడు సిక్స్‌ల దూరంలో సూర్యకుమార్ యాదవ్

టీమ్‌ఇండియా క్రికెటర్ సూర్యకుమార్‌ యాదవ్‌ (Suryakumar Yadav) టీ20ల్లో మరో మూడు సిక్స్‌లు బాదితే 100 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు. 

Published : 06 Aug 2023 19:44 IST

ఇంటర్నెట్ డెస్క్‌: లేటు వయసులో అంతర్జాతీయ క్రికెట్‌ను ఆరంభించిన సూర్యకుమార్‌ యాదవ్‌..  అతి తక్కువ కాలంలోనే టీ20ల్లో ప్రపంచ నంబర్‌వన్‌ బ్యాటర్‌గా అవతరించాడు. టీ20 క్రికెట్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డులు నెలకొల్పిన సూర్యకుమార్‌..  మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకోనున్నాడు. ఇప్పటివరకు 49  అంతర్జాతీయ టీ20లు ఆడిన సూర్య.. మరో మూడు సిక్స్‌లు బాదితే 100 సిక్స్‌ల మైలురాయిని అందుకుంటాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో అతడు ఈ రికార్డు నమోదు చేసే అవకాశముంది.

అప్పటి వరకూ ఆడాలని ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు

భారత్‌ తరఫున టీ20ల్లో ఇప్పటివరకు రోహిత్‌ శర్మ, విరాట్ కోహ్లీ మాత్రమే 100 కంటే ఎక్కువ సిక్స్‌లు బాదారు. రోహిత్‌ శర్మ 148 మ్యాచ్‌ల్లో 182 సిక్స్‌లు,  విరాట్ కోహ్లీ 115 మ్యాచ్‌ల్లో 117 సిక్స్‌లు కొట్టారు. ఐపీఎల్‌లో గాయపడి ప్రస్తుతం కోలుకుంటున్న కేఎల్‌ రాహుల్ 99 సిక్స్‌లతో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక సిక్స్‌లు బాదిన ఆటగాళ్ల విషయానికొస్తే.. రోహిత్‌ శర్మ (182) అగ్రస్థానంలో ఉన్నాడు. మార్టిన్‌ గప్తిల్ (న్యూజిలాండ్, 173), ఆరోన్ ఫించ్‌ (ఆస్ట్రేలియా,125), క్రిస్‌ గేల్ (వెస్టిండీస్‌, 124), పాల్ స్టిర్లింగ్ (ఐర్లాండ్,123), ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్, 120) వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని