Tilak Varma: నా తొలి హాఫ్ సెంచరీ.. సమైరాకి అంకితం: తిలక్ వర్మ

కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించిన తిలక్‌ వర్మ (Tilak Varma) అరుదైన ఘనత సాధించాడు. అలాగే తొలి అర్ధ శతకాన్ని చిన్నారి సమైరాకి అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. ఇంతకీ సమైరా ఎవరంటే? 

Updated : 07 Aug 2023 15:19 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వెస్టిండీస్‌పై టీ20లతో (WI vs IND) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టిన హైదరాబాద్‌ యువ ఆటగాడు తిలక్ వర్మ (Tilak Varma) అదరగొట్టేస్తున్నాడు. ఇప్పటి వరకు జరిగిన రెండు టీ20ల్లోనూ భారత్‌ తరఫున టాప్‌ స్కోరర్‌గా నిలవడం గమనార్హం. మొదటి టీ20 మ్యాచ్‌లో 39 పరుగులు చేసిన తిలక్‌.. రెండో మ్యాచ్‌లో కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీ (51) మార్క్‌ను తాకాడు. అయితే, రెండు మ్యాచుల్లోనూ టీమ్‌ఇండియా (Team India) ఓడిపోయినప్పటికీ అతడి ఇన్నింగ్స్‌లు మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో తన తొలి హాఫ్ సెంచరీని కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకి (Samaira) అంకితం ఇస్తున్నట్లు తెలిపాడు. దీనికిగల కారణం ఏంటో కూడా వెల్లడించాడు. 

నాతో సహా.. బ్యాటర్లు మరింత బాధ్యత తీసుకోవాలి: హార్దిక్‌

‘‘రోహిత్ శర్మ - రితికా దంపతుల కుమార్తె సమైరాకి నా తొలి అర్ధశతకం అంకితం చేస్తున్నా. ముంబయి జట్టుతో ఐపీఎల్‌లో ఆడుతున్న సమయంలో సమైరాతో అనుబంధం ఏర్పడింది. అంతర్జాతీయ కెరీర్‌లో నేను చేసే తొలి సెంచరీ లేదా హాఫ్ సెంచరీని  అంకితం ఇస్తానని తనకు ప్రామిస్ చేశా. ఇప్పుడు సంబరాలను ఆమెతో చేసుకుంటా’’ అని తిలక్‌ తెలిపాడు. హాఫ్‌ సెంచరీతో అదరగొట్టిన తిలక్‌ వర్మ ఓ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అతి తక్కువ వయస్సులో హాఫ్‌ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా తిలక్‌ వర్మ రికార్డులకెక్కాడు. ఈ ఘనతను కేవలం 20 ఏళ్ల 271 రోజుల వయస్సులో అందుకున్నాడు. రోహిత్‌ శర్మ ఈ ఘనతను 20 ఏళ్ల 143 రోజుల వయస్సులో సాధించడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని