Virat Kohli : రికార్డులే అతడి ఇంటి పేరు..

ఈ పొట్టి ప్రపంచకప్‌లో అద్వితీయమైన ఆటతీరుతో ముందుకు సాగుతూ.. ఇప్పటికే మూడు అర్ధ శతకాలను నమోదు చేశాడు కోహ్లీ. ఇక తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై కొట్టిన 82 పరుగులు అతడి కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమే.

Updated : 05 Nov 2022 12:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  కింగ్‌ కోహ్లీ.. ఈ పేరే ఓ సంచలనం.. యువ క్రికెటర్లకు అతడో స్ఫూర్తిమంత్రం.. టీమ్‌ఇండియాలో అతడో నూతన ఉత్తేజం. టీ20 ప్రపంచకప్‌లో అద్వితీయమైన ఆటతీరుతో ముందుకు సాగుతూ.. ఇప్పటికే మూడు అర్ధ శతకాలను నమోదు చేశాడీ ఛేదన రారాజు. ఇక తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌పై కొట్టిన 82 పరుగులు అతడి కెరీర్‌లో ఎప్పటికీ ప్రత్యేకమే. రికార్డులను ఇంటి పేరుగా మార్చుకున్న ఈ క్రికెట్‌ యోధుడి పరుగుల దాహానికి.. ఎన్నో రికార్డులు దాసోహమన్నాయి. ఈ పరుగుల వీరుడి 34వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా కింగ్‌ ఇప్పటి వరకూ సాధించిన కొన్ని రికార్డులను ఓసారి చూద్దాం.. 

 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు(1,065)

వన్డేల్లో వేగవంతంగా 8,000, 9,000, 10,000, 11,000, 12,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడు.

టీ20ల్లో ఎక్కువ ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు సాధించిన ఆటగాడు(7)

టీ20ల్లో ఎక్కువ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న బ్యాటర్‌(15)

టీ20ల్లో అత్యధిక పరుగులు (3,932)

టీ20ల్లో వేగవంతంగా (81 ఇన్నింగ్స్‌లు) మూడు వేల పరుగులు పూర్తి చేసిన ఆటగాడు

వన్డేల్లో ఒక జట్టుపై అత్యధిక శతకాలు నమోదు చేసిన ఆటగాడు(వెస్టిండీస్‌పై 9 శతకాలు)

టీ20ల్లో అత్యధిక అర్ధ శతకాలు(37)

టెస్టుల్లో టీమ్‌ఇండియా సారథిగా ఎక్కువ విజయాలు(40)

ఆస్ట్రేలియాలో టెస్టు సిరీస్‌ నెగ్గిన ఒకే ఒక్క భారత కెప్టెన్‌(2018/19)

వన్డేల్లో విజయవంతమైన ఛేదనల్లో భారత్‌ తరఫున అత్యధిక సెంచరీలు(26)

టీ20ల్లో అత్యధిక బ్యాటింగ్‌ యావరేజ్‌ (53.13)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని