Bengaluru vs Chennai: బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే పరిస్థితి ఏంటి?

Bengaluru vs Chennai - Rain: బెంగళూరు, చెన్నై మధ్య జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ రద్దయితే ఏం జరుగుతుంది.

Updated : 18 May 2024 20:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఆసక్తికర పోరును వర్షం నీరుగారుస్తుందా? ఏమో చిన్నస్వామి స్టేడియం దగ్గర పరిస్థితి చూస్తుంటే అలానే ఉంది. ప్లేఆఫ్స్‌ (IPL PlayOffs) నాలుగో బెర్తును నిర్ణయించే బెంగళూరు, చెన్నై మ్యాచ్‌ (Bengaluru vs Chennai) వర్షం కారణంగా కాసేపు నిలిచిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ మూడు ఓవర్లు ముగియగానే వరుణుడు పలకరించాడు. ఈ నేపథ్యంలో వర్షం కారణంగా రద్దయితే పరిస్థితి ఏంటి అనే చర్చ మొదలైంది. పాయింట్ల పట్టికలో చెన్నై ప్రస్తుతం 14 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. బెంగళూరు 12 పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే చెరో పాయింట్‌ లభిస్తుంది. అప్పుడు చెన్నై 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు వెళ్తుంది. బెంగళూరు 13 పాయింట్లతో ఇంటిముఖం పడుతుంది. 


బెంగళూరు - చెన్నై మ్యాచ్‌.. ఆసక్తికర అంశాలు

👉 చెన్నైకి గోల్డెన్ ఛాన్స్‌.. ఇలా జరిగితే ఏకంగా రెండో స్థానానికే!

👉 కోహ్లీకి కలిసొచ్చే ‘నంబర్‌ 18’.. ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కు చేరుస్తుందా?

👉 బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్‌’ ఛాన్స్‌.. అదెలాగంటే?

👉 బెంగళూరు-చెన్నై కీలక పోరు.. వాతావరణ పరిస్థితి ఎలా ఉండనుందంటే?


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు