Jio Ai Classroom: జియో ఏఐ క్లాస్‌రూమ్‌

Eenadu icon
By Technology News Team Published : 29 Oct 2025 02:17 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కృత్రిమ మేధ గురించి ప్రాథమిక అంశాలు నేర్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే జియో ఏఐ క్లాస్‌రూమ్‌-ఫౌండేషన్‌ కోర్స్‌ సాయం తీసుకోండి. ఇటీవల నిర్వహించిన ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ 2025 సదస్సులో రిలయన్స్‌ సంస్థ దీన్ని పరిచయం చేసింది. ఏఐ విద్యను సమగ్రంగా అందించటం, భవిష్యత్తుకు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దటం దీని ఉద్దేశం. 

  • జియో ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యంతో రూపొందించిన ఏఐ క్లాస్‌రూమ్‌-ఫౌండేషన్‌ కోర్స్‌ జియోపీసీతో పనిచేస్తుంది. ఏఐతో బోధన, సృజన, ఉత్పాదకత, కమ్యూనికేషన్లను పెంపొందించు
  • కోవాలని భావించేవారికిది మంచి అవకాశం. విద్యార్థులు, ఏఐ అంటే తెలియని కొత్తవారికిది ఎంతో ఉపయుక్తం.
  • చాట్‌జీపీటీ, నోట్‌బుక్‌ఎల్‌ఎం, అడోబ్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి టూల్స్‌తో సాధన చేసి ఏఐని సురక్షితంగా, సమర్థంగా వాడుకోవటమెలాగో నేర్చుకోవచ్చు. భవిష్యత్‌ ఏఐ కాలానికి సరిపోయేలా చదువుకోవటం దగ్గరి నుంచి దృశ్యాలను, కథలను సృష్టించటం వరకూ ఎన్నెన్నో చేయొచ్చు. 
  • ప్రాక్టికల్‌ పరీక్షలు, క్రియేటివ్‌ టూల్స్, ఫైనల్‌ ప్రాజెక్టుతో కూడిన కోర్సు వ్యవధి 4 వారాలు. డెస్క్‌టాప్స్, ల్యాప్‌టాప్స్, జియో సెట్‌-టాప్‌ బాక్సెస్‌లో దీన్ని యాక్సెస్‌ చేయొచ్చు. 
  • ఆయా అంశాలతో కూడిన వీడియో లెక్చర్లు.. పీడీఎఫ్, వీడియో రిఫరెన్స్‌లతో ప్రత్యేక వనరులు.. మోడల్‌ క్విజ్‌లు అన్నీ ఉంటాయి. https://www.jio.com/ai-classroom ద్వారా ఉచితంగా రిజిస్టర్‌ చేసుకోవచ్చు.  
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని