zoho: జోహో ఉచిత ఏజెంటిక్‌ టూల్స్‌

Eenadu icon
By Technology News Team Published : 22 Oct 2025 04:42 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

వ్యాపార, వాణిజ్య సంస్థల కోసం జోహో కొత్త ఏజెంటిక్‌ ఏఐ ఫీచర్ల అమలును ఆరంభించింది. ఇవి జోహోకు చెందిన కొలాబరేషన్, కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్, హ్యూమన్‌ రిసోర్స్‌ ఆఫరింగ్స్‌లో ఉచితంగా అందుబాటులో ఉంటాయి. 

నదేశంలో వ్యాపార సంస్థలు అత్యవసర ఏఐ ఫీచర్లను త్వరగా అందిపుచ్చుకోవటంలో ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి. వీటిని అధిగమించే ఉద్దేశంతోనే జోహో కొత్త ఏజెంటిక్‌ ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. కంపెనీలు తమ కస్టమర్ల సంఖ్య పెంచుకోవటానికి, సమయాన్ని ఆదా చేసుకో వటానికి, ఎక్కువ విలువైన పనుల మీద దృష్టి సారించటానికివి ఉపయోగపడతాయి. 

  • ఈమెయిల్, కొలాబరేషన్‌ సూట్‌ అయిన జోహో వర్క్‌ప్లేస్‌కు ఇప్పుడు ఆస్క్‌ జియా (జోహోకు చెందిన కన్వర్జేషనల్‌ ఏఐ అసిస్టెంట్‌) జత చేరింది. యూజర్లు దీనికి ప్రాంప్ట్‌ ద్వారా పనులు అప్పగించొచ్చు. ఉదాహరణకు- ఆయా ఈమెయిళ్లను వెతకొచ్చు, కన్వర్జేషన్ల సారాంశాన్ని పొందొచ్చు. కొత్త ఈమెయిళ్లను రాయొచ్చు, పంపొచ్చు కూడా. జోహో మెయిల్, జోహో షీట్, జోహో టేబుల్స్, జోహో క్లిక్‌ అన్నింటి వేదికైన వర్క్‌ప్లేస్‌లోని పలు యాప్స్‌ నుంచి ఇది ఒకేసారి డేటాను సేకరించగలదు. అందువల్ల మాటలతోనే త్వరగా పనులు చేసుకోవచ్చు. కేలండర్‌లో మీటింగ్‌ను షెడ్యూల్‌ చేయటానికి జోహో పీపుల్‌ను స్కాన్‌ చేసి, ఎవరు సెలవులో ఉన్నారో తెలుపుతుంది కూడా. 
  • లీడ్‌ జనరేషన్‌ అనే ఏజెంట్‌ దానంతటదే చదవని ఈమెయిళ్లను స్కాన్‌ చేస్తుంది. సేల్స్‌కు సంబంధించిన ప్రశ్నలను గుర్తిస్తుంది. వాటిని తనకుతానే సేల్స్‌ లీడ్స్‌గా మార్చి జోహో సీఆర్‌ఎంకు పంపుతుంది. దీంతో మాన్యువల్‌గా వడపోయటం తప్పుతుంది. సమయమూ ఆదా అవుతుంది. 
  • జోహో టేబుల్స్‌లోని సెంటిమెంట్‌ ఎనాలిసిస్, లాంగ్వేజ్‌ డిటెక్టర్‌ ఫీచర్లు డేటాను విశ్లేషించి దాని ధ్వనిని, ఉద్దేశాన్ని, సమాచారంలోని సందర్భాన్ని గుర్తిస్తాయి.
  • జోహో డెస్క్‌లోని రెజల్యూషన్‌ ఎక్స్‌పర్ట్‌ ఏజెంటేమో టికెట్‌ పరిష్కారాలను నమోదు చేస్తుంది. మున్ముందు సమస్యలను త్వరగా పరిష్కరించటంలో సాయంత చేస్తుంది. 
  • జోహో రిక్రూట్‌లోని కాండిటేట్‌ మ్యాచెస్‌ అండ్‌ జాబ్‌ మ్యాచెస్‌ టూల్స్‌ దరఖాస్తు దారుల రెజ్యూమెను పరిశీలించి తగిన వారిని నిర్ణయిస్తుంది. ఏఐ అసిస్టెడ్‌ అసెస్‌మెంట్‌ జనరేషన్‌ టూల్‌ ప్రశ్నలు, జవాబుల వంటి వాటిని మదించి ఆయా ఉద్యోగాలు, అవసరాలకు అనుగుణంగా స్కోర్‌ ఇస్తుంది. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని