హెచ్‌-1బి వీసాలకు లాటరీ

అమెరికాలో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో అవకాశం వచ్చింది. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన హెచ్‌-1బి వీసాల ర్యాండమ్‌....

Updated : 31 Jul 2021 05:30 IST

వాషింగ్టన్‌: అమెరికాలో ఉద్యోగం చేయాలని ఎదురుచూస్తున్న భారతీయ ఐటీ నిపుణులకు మరో అవకాశం వచ్చింది. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన హెచ్‌-1బి వీసాల ర్యాండమ్‌ ఎంపికలో అవకాశం దక్కని వారికి అమెరికా సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎస్‌సీఐఎస్‌) గురువారం మరోసారి లాటరీ నిర్వహించింది. 2022 ఆర్థిక సంవత్సరానికి అమెరికా అవసరాలకు సరిపడా వీసాలు కంప్యూటరైజ్డ్‌ లాటరీలో జారీ కాలేదని, ఈ కారణంగానే రెండోసారి లాటరీ తీసి 27,717 మందిని అదనంగా ఎంపిక చేసినట్టు యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఈ లాటరీలో ఎంపికైన వారు తమ పిటిషన్‌ ఫైల్‌ చేసేందుకు ఆగస్టు 2 నుంచి నవంబరు 3 వరకు సమయం ఇస్తున్నట్టు చెప్పింది. కాగా రెండో లాటరీలో ఎంపికైన వారిలో అత్యధికులు భారతీయులేనని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని