పాఠ్యాంశంగా తాండూరు కందిపప్పు

తాండూరు కందిపప్పు అంశాన్ని పాఠశాల విద్య పాఠ్యాంశంగా చేర్చుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు.

Published : 01 Feb 2023 03:58 IST

మంత్రి నిరంజన్‌రెడ్డి

న్యూస్‌టుడే, తాండూరు: తాండూరు కందిపప్పు అంశాన్ని పాఠశాల విద్య పాఠ్యాంశంగా చేర్చుతామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తనకు లేఖను సమర్పిస్తే విద్యాశాఖకు పంపిస్తానని చెప్పారు. మంగళవారం వికారాబాద్‌ జిల్లా తాండూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో జరిగిన కంది రైతుల అభినందన సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా తాండూరు కందిపప్పునకు లభించిన భౌగోళిక గుర్తింపు ధ్రువపత్రాన్ని యాలాల రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘం రైతులకు అందజేశారు.  మంత్రి మాట్లాడుతూ తాండూరు కందిపప్పు రుచితో పాటు నాణ్యంగా ఉండడానికి ఇక్కడి నేలలో లభించే సున్నపు రాయిలోని అట్టాపుల్‌గేట్‌ పోషకం కారణమని చెప్పారు. తాండూరులో కంది బోర్డు ఏర్పాటు ప్రాధాన్యాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళతానన్నారు.  ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి,  ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ నిఖిల, జీఐ ట్యాగ్‌ అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ హబీబుల్లా, ఆచార్య జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు