ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐకి అప్పగింతపై 6న హైకోర్టు తీర్పు

ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లపై ఈనెల 6న హైకోర్టు తీర్పు వెలువరించనుంది.

Published : 04 Feb 2023 04:10 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి అప్పగిస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి దాఖలు చేసిన అప్పీళ్లపై ఈనెల 6న హైకోర్టు తీర్పు వెలువరించనుంది. మొయినాబాద్‌ ఫాంహౌస్‌ కేసు సీబీఐకి అప్పగించాలని కోరుతూ నిందితులు రామచంద్ర భారతి అలియాస్‌ సతీష్‌ శర్మ, కోరె నందకుమార్‌ అలియాస్‌ నందు, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిలతో పాటు న్యాయవాది భూసారపు శ్రీనివాస్‌, కేరళకు చెందిన భారత్‌ ధర్మ జన సేన తుషార్‌లు వేర్వేరుగా పిటిషన్లను దాఖలుచేశారు. వాటిని విచారించిన సింగిల్‌ జడ్జి కేసు దర్యాప్తును సిట్‌ నుంచి సీబీఐకి అప్పగిస్తూ డిసెంబరు 26న తీర్పు వెలువరించారు. దాన్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేలు 6 అప్పీళ్లను దాఖలుచేశారు. వీటిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌, జస్టిస్‌ ఎన్‌.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ వాదనల అనంతరం తీర్పును వాయిదావేసింది. జనవరి 30న సిట్‌ రాత పూర్వక వాదనలను కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో సోమవారం ధర్మాసనం తీర్పు వెలువరించనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు