ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు నిందితుల బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది.

Published : 23 Apr 2024 03:54 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణను నాంపల్లి కోర్టు ఈ నెల 24కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్న, ప్రణీత్‌రావు బెయిల్‌ పిటిషన్లు దాఖలు చేయగా ప్రతిగా పోలీసులు కౌంటర్‌ దాఖలు చేశారు. సోమవారం నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్లపై వాదనలు జరిగాయి. బెయిల్‌ ఇస్తే నిందితులు సాక్షులను ప్రభావితం చేస్తారని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని