ఏఎస్‌ఆర్‌బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక

జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్‌ఆర్‌బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్‌ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్‌ దీపక్‌, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్‌ స్పెషలిస్టు (ఎస్‌ఎంఎస్‌)లుగా ఎంపికయ్యారు.

Published : 28 Apr 2024 03:49 IST

ఈనాడు, హైదరాబాద్‌: జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్‌ఆర్‌బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్‌ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్‌ దీపక్‌, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్‌ స్పెషలిస్టు (ఎస్‌ఎంఎస్‌)లుగా ఎంపికయ్యారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో సబ్జెక్టు మ్యాటర్‌ స్పెషలిస్టులుగా వీరు పనిచేస్తారు. కమ్యూనిటీ సైన్స్‌ డీన్‌ విజయలక్ష్మి, అధ్యాపకులు వారిని అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని