40 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి

తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీయూఎంహెచ్‌ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

Published : 30 Apr 2024 06:11 IST

టీయూఎంహెచ్‌ఈయూ విజ్ఞప్తి

సుల్తాన్‌బజార్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్‌మెంట్‌తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్‌ మెడికల్‌, హెల్త్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(టీయూఎంహెచ్‌ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు యాదానాయక్‌, ఎండీ ఫసీయుద్దీన్‌, ప్రతినిధులు బి.కిరణ్మయి, బైరపాక శ్రీనివాస్‌, జె.సుధాకర్‌లతో కూడిన బృందం సోమవారం బీఆర్‌కే భవన్‌లో పీఆర్సీ ఛైర్మన్‌ ఎన్‌.శివశంకర్‌, సభ్యులు బి.రామయ్యలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల కనీస వేతనం రూ.30,400, గరిష్ఠ వేతనం రూ.2,58,980గా నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని, హెచ్‌ఆర్‌ఏను గ్రేటర్‌ పరిధిలో 30%, ఇతర ప్రాంతాల్లో 20% ఇవ్వాలని, గ్రాట్యుటీ రూ.16 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచాలన్నారు. అనంతరం ఛైర్మన్‌కు వినతి పత్రం సమర్పించారు.

రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేస్తున్న గణాంక ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ చేయాలని  గణాంక ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దండమూడి నాగమల్లేశ్వరరావు నేతృత్వంలో సంఘం ప్రతినిధులు సోమవారం రెండో పీఆర్సీ కమిటీ ఛైర్మన్‌ శివశంకర్‌తో సమావేశమై గణాంక ఉద్యోగుల జీతభత్యాల విషయమై చర్చించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని