ఉదయం 11 గంటలకు పది ఫలితాలు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు  వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు.

Published : 30 Apr 2024 03:11 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం ఉదయం 11 గంటలకు  వెల్లడికానున్నాయి. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హైదరాబాద్‌లోని రాష్ట్ర విద్యా పరిశోధన మండలి ప్రాంగణంలోని ఆడిటోరియంలో ఫలితాలను విడుదల చేస్తారు. http://results.bse.telangana.gov.in, http://results.bsetelangana.org వెబ్‌సైట్లతోపాటు www.eenadu.net, www.eenadupratibha.net లలోనూ చూడవచ్చు. పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2 వరకు జరగగా.. 5,08,385 మంది విద్యార్థులు రాశారు. వన్‌టైమ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌(ఓటీఆర్‌) తరహాలో తొలిసారిగా తెలంగాణలో 10వ తరగతి మార్కుల మెమోలపై పర్మనెంట్‌ ఎడ్యుకేషన్‌ నంబరు(పెన్‌) ముద్రించినట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని