California: గడ్డకట్టిన కాలిఫోర్నియా.. జనజీవనానికి ఆటంకం

మంచు తీవ్రతతో అమెరికాలోని కాలిఫోర్నియా గడ్డ కట్టుకుపోతోంది. ఈ పరిస్థితులు జన జీవనానికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి.

Published : 04 Mar 2024 11:47 IST

వాషింగ్టన్‌: అమెరికాలోని కాలిఫోర్నియా (California)లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. చలి గాలులు, మంచు తీవ్రతతో ఆ ప్రాంతమంతా పూర్తిగా గడ్డ కట్టుకుపోయే పరిస్థితులు నెలకొన్నాయి.కొన్ని పర్వత ప్రాంతాలు, ప్రధాన నగరాల రహదారులు మంచుతో నిండిపోవడంతో రాకపోకలను అధికారులు నిలిపివేశారు. విద్యుత్తు సేవలకు అంతరాయం కలుగుతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సియెర్రా నెవాడా పర్వతాల్లో ఆదివారం 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా మంచు కురిసినట్లు అంచనా. మంచు తుపాను కారణంగా నెవాడాలోని ప్రధాన రహదారిని గతవారం మూసివేశారు. పర్వతప్రాంతాల్లో అవలాంచి (avalanches) సంభవించే ప్రమాదం ఎక్కువగా ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి. అధిక గాలులు, మంచు ప్రభావంతో కోల్‌ఫాక్స్‌, నెవాడా స్టేట్‌ లైన్‌ మధ్యనున్న అంతరాష్ట్ర 80ను మూసివేశారు.

నిక్కీ హేలీకి తొలి విజయం.. డీసీ ప్రైమరీలో ట్రంప్‌పై గెలుపు

పర్వత ప్రాంతాల్లో గంటకు 72 కిలోమీటర్ల వేగంతో చలిగాలులు వీస్తున్నట్లు జాతీయ వాతావరణ సర్వీసు వెల్లడించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. సోడా స్ప్రింగ్స్‌, షుగర్‌ బౌల్‌, ఇతర పర్వత పట్టణాల్లో శుక్రవారం రెండు మీటర్ల కంటే ఎక్కువ మంచు కురిసింది. ప్రమాదకర పరిస్థితుల నేపథ్యంలో యోస్‌మైట్‌ నేషనల్‌ పార్క్‌ను మూసేశారు. కొన్ని ప్రాంతాల్లో మంచు తుపాను తగ్గుముఖం పట్టినప్పటికీ.. మళ్లీ ఇవి సంభవించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. భారీ మంచు కారణంగా ఉత్తర కాలిఫోర్నియాలో వేల గృహాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు