Groom Passport: పాస్‌పోర్టును నమిలేసిన శునకం.. చిక్కుల్లో పడ్డ వరుడు!

పది రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన జంట.. పెంపుడు శునకం చేసిన పనితో చిక్కుల్లో పడింది. అసలేం జరిగిందంటే..

Updated : 21 Aug 2023 11:19 IST

వాషింగ్టన్‌: ఒక శునకం (Dog) చేసిన పనికి ఏకంగా పెళ్లి ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకునేందుకు వేరే దేశానికి వెళ్లాలనుకున్న వరుడి పాస్‌పోర్టు (Passport)ను పెంపుడు శునకం నమిలేసింది. దీంతో ఆ వ్యక్తి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఘటన అమెరికా (America)లో చోటు చేసుకొంది.

డొనాటో ఫ్రాట్టరోలిస్ అనే వ్యక్తికి మాగ్దా మజ్రీస్ అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ మేరకు వారు ఇటలీ (Italy)లో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వేడుక ఏర్పాట్లలో భాగంగా బయటకు వెళ్లారు. ఈ సమయంలో డొనాటో పెంపుడు శునకం అతడి పాస్‌పోర్ట్‌ను నమిలేసింది. ఇంటికి చేరుకున్న అనంతరం కుక్క చేసిన పనిని చూసి అందరూ కంగుతిన్నారు.

నా సిబ్బందే.. నన్ను మోసం చేశారు

దీంతో వరుడు స్థానిక అధికారుల దగ్గరికి పరుగులు పెట్టాడు. ప్రత్యామ్నాయం కోసం సహాయం కోరాడు. ‘‘ఆగస్టు 31న ఇటలీలో నా వివాహం జరగనుంది. ఇలాంటి సమయంలో మా శునకం ఈ పని చేసింది. అదృష్టవశాత్తూ, కాంగ్రెస్‌ సభ్యుడు ఒకరు, లించ్‌, మార్కీ కార్యాలయాలు స్పందించాయి. ఈ సమస్య తొందరగా పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను. లేకపోతే నేను లేకుండానే నాకు కాబోయే భార్యతో సహా బంధువులంతా ఇటలీకి వెళ్లిపోతారు. నేను ఇక్కడే ఉండిపోవాల్సి ఉంటుంది’’ అని డొనాటో తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని