నా సిబ్బందే.. నన్ను మోసం చేశారు

పాక్‌ రాజకీయాల్లో ఆదివారం మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ కేంద్ర బిందువయ్యారు.

Published : 21 Aug 2023 05:08 IST

అధికార రహస్యాల చట్టం సవరణ బిల్లుపై సంతకం చేయలేదు
పాక్‌ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ సంచలన ప్రకటన

ఇస్లామాబాద్‌: పాక్‌ రాజకీయాల్లో ఆదివారం మరో నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. దీనికి ఆ దేశ అధ్యక్షుడు ఆరిఫ్‌ అల్వీ కేంద్ర బిందువయ్యారు. చట్టంగా రూపొందిన అధికార రహస్యాల, పాక్‌ సైన్య చట్టాల సవరణ బిల్లులపై తాను సంతకాలు చేయలేదంటూ బాంబు పేల్చారు. ‘‘అల్లాయే సాక్ష్యం. ఈ సవరణ బిల్లులపై సంతకాలు చేయలేదు. వీటితో విభేదించాను. సంతకం చేయని ఆ బిల్లులను నిర్దిష్ట సమయంలో తిరిగి పంపమని చెప్పాను. కానీ నా సిబ్బందే నన్ను మోసం చేశారు. నా అధికారాన్ని ఖాతరు చేయలేదు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అటక్‌ జైల్లో ఉన్న తెహ్రీక్‌-ఎ-ఇన్సాఫ్‌ ఛైర్మన్‌ ఇమ్రాన్‌ఖాన్‌కు అల్వీ సన్నిహితుడని పేరు ఉంది. ఈ అధికార రహస్యాల చట్టం ప్రకారమే శనివారం ఇమ్రాన్‌ మరో సన్నిహితుడు షా మహమ్మద్‌ ఖురేషీని పోలీసులు అరెస్టు చేయడం గమనార్హం. అల్వీ ప్రకటనను న్యాయ మంత్రిత్వశాఖ ఖండించింది. రాజ్యాంగంలోని అధికరణం 5 కింద నిర్దిష్ట సమయంలో బిల్లులను అధ్యక్షుడు పంపించలేదని.. అందుకే అవి చట్టాల కింద మారాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని