మానసిక ఒత్తిడికి హైపోథాలమస్సే మూలం

నిరంతరం మానసిక ఒత్తిడికి గురైతే మానసిక కుంగుబాటు, గతంలో ఆనందమిచ్చిన అంశాలపై ఆసక్తి తగ్గిపోవడం, మనో విఘాతం తరవాత దీర్ఘకాలం పీడించే మానసిక రుగ్మత (పీటీఎస్డ్డీ) తలెత్తవచ్చు.

Published : 25 Jan 2023 05:53 IST

వాషింగ్టన్‌: నిరంతరం మానసిక ఒత్తిడికి గురైతే మానసిక కుంగుబాటు, గతంలో ఆనందమిచ్చిన అంశాలపై ఆసక్తి తగ్గిపోవడం, మనో విఘాతం తరవాత దీర్ఘకాలం పీడించే మానసిక రుగ్మత (పీటీఎస్డ్డీ) తలెత్తవచ్చు. మానసిక ఒత్తిడి వ్యక్తి ప్రవర్తనలో విపరీత మార్పులు తెస్తుందని అమెరికాలోని అగస్టా విశ్వవిద్యాలయ పరిశోధకులు తేల్చారు. మెదడులో హైపోథాలమస్‌ అనే భాగం భావోద్వేగాలను కలిగించే హార్మోన్లను విడుదల చేస్తుంది. నిద్ర, ఆహార, భయం వంటి భావనలతోపాటు శృంగార కాంక్షలకు కేంద్రమిదే. ఈ భాగంలోని పీఓఎంసీ న్యూరాన్ల సమూహాన్ని 10 రోజుల పాటు నిరంతరం, అనూహ్య ఒత్తిడికి గురిచేయగా నిరాశా నిస్పృహలు తలెత్తడంతోపాటు శృంగార కాంక్ష తగ్గడం, ఆనందదాయక క్షణాలను ఆస్వాదించలేకపోవడం వంటివి సంభవిస్తున్నట్లు ఆడ, మగ ఎలుకలపై పరిశోధనలు తేల్చాయి. హైపోథాలమస్‌లోనే ఉన్న ఏజీఆర్పీ న్యూరాన్లు నిరంతర ఒత్తిడి నుంచి, మానసిక కుంగుబాటు నుంచి కోలుకోవడానికి తోడ్పడతాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని