భారత్‌కు ఎప్పుడో ఆధారాలిచ్చాం
భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు.
నిజాల నిరూపణలో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం
నిజ్జర్ హత్యపై కెనడా ప్రధాని ట్రూడో
టొరంటో, వాషింగ్టన్, దిల్లీ: భారత్‌ను రెచ్చగొట్టడం తమ ఉద్దేశం కాదంటూనే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. కెనడాలో ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చన్న విశ్వసనీయమైన ఆరోపణలపై ఆధారాలను చాలా వారాల క్రితమే భారత్‌కు ఇచ్చామని, నిజాల నిరూపణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. కెనడా పర్యటనకు వచ్చిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. నిజ్జర్ హత్యోదంతంతో చెలరేగిన వివాదంపై ఈ మేరకు తాజాగా స్పందించారు. ‘సీరియస్ అంశంలో వాస్తవాలను గుర్తించేందుకు భారత్ మాతో కలిసి పనిచేస్తుందని ఆశిస్తున్నాం. రెండు దేశాలూ ఈ కేసులో నిజాన్ని తేల్చడం ముఖ్యం. దానికి మేం కట్టుబడి ఉన్నాం’ అని అన్నారు. నిజ్జర్ విషయంలో కెనడా ఇప్పటివరకు ఎలాంటి నిర్దిష్ట సమాచారాన్ని చెప్పలేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి దిల్లీలో స్పష్టంచేశారు.
కెనడాలోని హిందువులపై విద్వేషాన్ని రగిల్చేలా ఆన్‌లైన్‌లో జరుగుతున్న ప్రచారాన్ని కెనడా మంత్రులు, రాజకీయనాయకులు ఖండించారు. హిందువుల్ని తాము స్వాగతిస్తున్నామని, వారు కెనడాలో సురక్షితంగానే ఉన్నారని తెలిపారు. నిజ్జర్ మత నాయకుడు కాదని, ఉగ్రవాదేనని దిల్లీలో ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 1980-90 మధ్య పంజాబ్‌లో సుమారు 200 మందిని హతమార్చిన దీపా హెరన్‌వాలాతో నిజ్జర్‌కు సన్నిహిత సంబంధాలున్నాయని తెలిపాయి. 1996లో కెనడాకు పారిపోవడం నుంచి ఎక్కడెక్కడ ఏయే కార్యకలాపాలు నిర్వహించిందీ వివరించాయి. హరియాణాలోని సిర్సాలో డేరా సచ్ఛాసౌధా ప్రధాన కార్యాలయంపై ఉగ్రదాడికి పన్నాగం పన్నినా, భారత వీసా మంజూరుకాకపోవడం వల్ల రాలేదని తెలిపాయి.
జవాబుదారీ ముఖ్యం: బ్లింకెన్
ప్రస్తుత వివాదం విషయంలో కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ పిలుపునిచ్చారు. ‘మేం జవాబుదారీని చూడాలనుకుంటున్నాం. దర్యాప్తు కొనసాగడం, వాస్తవాలు వెలుగులోకి రావడం ముఖ్యం’ అని వ్యాఖ్యానించారు. ట్రూడో ఆరోపణలు తీవ్ర కలవరం కలిగించాయన్నారు. భారత్‌పై ట్రూడో ఆరోపణలు చేయడానికి ముందు ‘ఫైవ్ ఐస్’ కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు నిఘా వర్గాల సమాచారం అందిందని కెనడాలో అమెరికా రాయబారి డేవిడ్ కోహెన్ ధ్రువీకరించారు.
అమెరికా మొగ్గు భారత్‌వైపే: పెంటగాన్ మాజీ అధికారి
ఖలిస్థాన్ నేత హత్యోదంతంలో భారత్‌కు బాసటగానే అమెరికా నిలిచే అవకాశం ఉందని పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ అభిప్రాయపడ్డారు. ‘రెండు మిత్రదేశాల విషయంలో ఒకరికి అమెరికా మద్దతుగా నిలుస్తుందని నేను అనుకోవడం లేదు. ఒకవేళ అలా ఎంచుకోవాల్సి వస్తే అమెరికా మొగ్గు భారత్ వైపే ఉంటుంది. ఎందుకంటే నిజ్జర్ ఒక ఉగ్రవాది. అమెరికాకు భారత్ చాలా ముఖ్యమైంది. కెనడా ప్రధాని హోదాలో జస్టిన్ ట్రూడో ఎక్కువకాలం కొనసాగకపోవచ్చు. ఆయన వెళ్లిపోయిన తర్వాత కెనడాతో మా బంధాన్ని పునర్నిర్మించుకుంటాం’ అని చెప్పారు. ‘ఈ ఘర్షణ భారత్ కంటే కెనడాకే ఎక్కువ ప్రమాదం. ఘర్షణే కావాలనుకుంటే అది ఏనుగుతో చీమ పోరాటంలాగే ఉంటుంది. ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమనేది వాస్తవం. చైనాను ఎదుర్కొనే విషయంలో వ్యూహాత్మకంగా భారత్‌తో మా బంధం చాలా ముఖ్యమైంది’ అని స్పష్టంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్‌గా తీసుకుంది. అదే సమయంలో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. -
Iraq: ఇరాక్‌లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్‌లోని దియాలా ప్రావిన్స్‌లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్‌పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్‌లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Tollywood: సినీ పరిశ్రమలో విషాదం.. సీనియర్ నటి కన్నుమూత
-
Bomb threat: బెంగళూరులో 15 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఏడుగురి మృతి
-
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
-
Atharva Movie Review: రివ్యూ: ‘అథర్వ’ ప్రయోగంతో ఆకట్టుకున్నాడా!
-
Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. రికార్డు గరిష్ఠానికి నిఫ్టీ