న్యాయమూర్తిపై విరుచుకుపడిన ట్రంప్‌.. కోర్టులో వ్యంగ్యంగా వాంగ్మూలం

తనను కోర్టు వివాదంలోకి లాగిన న్యాయవాదిపై, కేసును విచారిస్తున్న జడ్జిపైనా అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డోనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం విచారణ సందర్భంగా మండిపడ్డారు.

Updated : 08 Nov 2023 07:10 IST

జడ్జి మందలించినా మారని ధోరణి

న్యూయార్క్‌: తనను కోర్టు వివాదంలోకి లాగిన న్యాయవాదిపై, కేసును విచారిస్తున్న జడ్జిపైనా అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్‌ పార్టీ నేత డోనాల్డ్‌ ట్రంప్‌ సోమవారం విచారణ సందర్భంగా మండిపడ్డారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంక్షిప్త సమాధానాలు ఇవ్వాలన్న న్యాయమూర్తి సూచనను పదే పదే ఉల్లంఘిస్తూ, ఉపన్యాస ధోరణిలో, వ్యంగ్యంగా వాంగ్మూలం ఇచ్చారు. ట్రంప్‌ తన కంపెనీ ఆస్తుల విలువను వాస్తవిక విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులను, బీమా సంస్థలను మోసం చేశారన్నది ప్రధాన ఆరోపణ. చాలా ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఆరోపణలకు సంబంధించిన కేసు విచారణ ఇటీవల ప్రారంభమైంది. సోమవారం విచారణ సందర్భంగా ట్రంప్‌ను న్యూయార్క్‌ అటార్నీ జనరల్‌ ప్రశ్నించారు. వీటికి బదులిచ్చే క్రమంలో ట్రంప్‌...కోర్టు హాలును రాజకీయ వేదికగా వాడుకునే ప్రయత్నం చేశారు. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ తరఫు నుంచి ఆయన మరోసారి పోటీపడుతున్న విషయం తెలిసిందే. రాజకీయ ప్రత్యర్థులు తనపై ప్రతీకారంతోనే వరుసగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఉపన్యాస ధోరణిలో సమాధానాలు ఇవ్వడం తగదని, అడిగిన వాటికి మాత్రమే నేరుగా జవాబివ్వాలని జడ్జి ఆర్థర్‌ ఎన్గోరాన్‌ చెప్పినా ఫలితం లేకపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని