విదేశీ వలసదారులంటే భారత్‌కు భయం

విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. చైనా, రష్యా, జపాన్‌లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు.

Published : 03 May 2024 06:22 IST

 చైనా, రష్యా, జపాన్‌లకు కూడా..: బైడెన్‌

వాషింగ్టన్‌: విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్‌ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. చైనా, రష్యా, జపాన్‌లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. అవి వలసదారులను ఎంతమాత్రమూ ఆహ్వానించవని వ్యాఖ్యానించారు. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. అందుకు భిన్నంగా అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందని.. వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పారు. వాషింగ్టన్‌లో బుధవారం సాయంత్రం డెమోక్రాటిక్‌ పార్టీ విరాళాల సేకరణ కార్యక్రమంలో బైడెన్‌ ఈ మేరకు ప్రసంగించారు. అమెరికాకు మిత్రదేశాలైన భారత్‌, జపాన్‌లను తక్కువ చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉండటం చర్చనీయాంశమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని