Italy: విధి చేయు వింత అంటే ఇదే!

జీవనయానంలో విధి చేసే వింతలు ఒక్కోసారి ఆనందం పంచినా, విషాదం మిగిల్చినా అనూహ్యంగా ఉంటాయి. ఇటలీకి చెందిన ఓ జంటకు ఇలాంటి భయంకరమైన అనుభవమే ఎదురైంది.

Updated : 23 Dec 2023 11:51 IST

ఏకకాలంలో విమాన ప్రమాదాలు తప్పించుకున్న జంట

రోమ్‌: జీవనయానంలో విధి చేసే వింతలు ఒక్కోసారి ఆనందం పంచినా, విషాదం మిగిల్చినా అనూహ్యంగా ఉంటాయి. ఇటలీకి చెందిన ఓ జంటకు ఇలాంటి భయంకరమైన అనుభవమే ఎదురైంది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకొంటున్న స్టెఫానో పిరెల్లి (30), ఆంటోనియెట్టా డెమాసి (22) ఇటలీలోని సావోనా పట్టణంలో స్నేహితులతో కలిసి క్రిస్మస్‌ విందులో పాల్గొనేందుకు వేర్వేరు ప్రాంతాల నుంచి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న బుల్లి విమానాలు (మైక్రో జెట్లు) గమ్యం చేరకముందే దాదాపు ఒకేసారి ప్రమాదాలకు గురయ్యాయి. స్టెఫానో ప్రయాణిస్తున్న టూ సీటర్‌ ఎయిర్‌క్రాఫ్టులో లోపం తలెత్తి క్రాష్‌ ల్యాండింగు అయింది. ఈ ప్రమాదస్థలానికి 25 మైళ్ల దూరంలో.. ఆంటోనియెట్టా వస్తున్న ఎయిర్‌క్రాఫ్టు కూడా ప్రమాదానికి గురైంది. పొగమంచు నడుమ చిమ్మచీకట్లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఈ జంటకు త్రుటిలో పెను ప్రమాదం తప్పడం అద్భుతమనే చెప్పాలి. స్టెఫానో ఎలాంటి ఇబ్బంది లేకుండా బయటపడగా.. ఆంటోనియెట్టాకు, ఓ పైలట్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయా ప్రాంతాలకు శరవేగంగా చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వారిని రక్షించి,  యువజంటతోపాటు ఇద్దరు పైలట్లను ఆసుపత్రికి తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని