బ్రెజిల్‌లోని హోటల్‌లో అగ్నిప్రమాదం

దక్షిణ బ్రెజిల్‌లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్‌లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

Published : 28 Apr 2024 05:22 IST

10 మంది సజీవదహనం, 11 మందికి గాయాలు

రియో డి జనీరో: దక్షిణ బ్రెజిల్‌లోని పాటో అలెగ్రి నగరంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నిరాశ్రయులైన వారికి ఆశ్రయం కల్పించేందుకు స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఓ హోటల్‌లో శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో 10 మంది సజీవదహనమయ్యారు. మరో 11 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. బాధితులందరికి మరోచోట ఆశ్రయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని