భారత సంతతి వ్యక్తికి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌’

భారత సంతతికి చెందిన మోహన్‌ మాన్సిగాని.. బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ పురస్కారం అందుకున్నారు.

Published : 04 Dec 2022 05:06 IST

లండన్‌: భారత సంతతికి చెందిన మోహన్‌ మాన్సిగాని.. బ్రిటన్‌ రాజకుటుంబం నుంచి ‘ఆర్డర్‌ ఆఫ్‌ ది బ్రిటిష్‌ ఎంపైర్‌ (ఓబీఈ)’ పురస్కారం అందుకున్నారు. ఉత్తర లండన్‌కు చెందిన మోహన్‌.. సెయింట్‌ జాన్‌ అంబులెన్స్‌ ఛారిటీకి ట్రస్టీగా వ్యవహరిస్తున్నారు. సంస్థలో ఆయన సేవలకు గుర్తింపుగా గతేడాది బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌-2 జన్మదిన వేడుకల్లో ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. తాజాగా ఎలిజబెత్‌ కుమార్తె ప్రిన్సెస్‌ అన్నే చేతులమీదుగా దీన్ని అందుకున్నారు. ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ అయిన మోహన్‌.. క్యాజువల్‌ డైనింగ్‌ గ్రూప్‌లో క్రియేటివ్‌ ఫైనాన్స్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. అనంతరం తన వ్యాపారాలను విక్రయించి స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని