H-1B visa: హెచ్‌-1బీ వీసాదారులకు అమెరికాలోనే రెన్యువల్‌.. కానీ..!

హెచ్‌-1బీ వీసా (H-1B visa) పునరుద్ధరణ కేవలం నిపుణులకు మాత్రమేనని, వారి కుటుంబీకులకు/వారిపై ఆధారపడిన వారికి ఇది వర్తించదని వెల్లడైంది.

Published : 05 Dec 2023 18:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హెచ్‌-1బీ వీసా (H-1B visa) పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేందుకు అమెరికా పలు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని కేటగిరీల హెచ్‌-1బీ వీసాలను దేశీయంగానే రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్‌ కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని అమెరికా విదేశాంగ వెల్లడించింది. అయితే, ఇది కేవలం నిపుణులకు మాత్రమేనని, వారి కుటుంబీకులకు/వారిపై ఆధారపడిన వారికి ఇది వర్తించదని తెలిసింది.

వీసా రెన్యువల్‌ కోసం గతంలో అమెరికా విడిచి వెళ్లాల్సి వచ్చేదని.. కానీ, ఈ నూతన కార్యక్రమం గణనీయ మార్పు తీసుకువస్తుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ తెలిపారు. ఈ సౌలభ్యాన్ని నిపుణుల కుటుంబీకులకు విస్తృత పరిచేముందు వాటి ప్రభావాన్ని అంచనా వేయాల్సి ఉందన్నారు. హెచ్‌-4 కింద వారి కుటుంబీకులు/ఆధారపడిన వారిని ఇందులో చేర్చాలని కోరుతూ ఆయా సంస్థల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో ఇలా స్పందించారు.

Green Card: గ్రీన్‌కార్డు ‘జీవిత కాలం’ లేటు

అమెరికాలోనే వీసా పునరుద్ధరించే ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20వేల మందికి వీసా రెన్యువల్‌ చేయనున్నారు. దీనికి దరఖాస్తు చేసుకునేవారు అమెరికా విదేశాంగశాఖకు వీసాలను పంపించాల్సి ఉంటుంది. ఈ సమయంలో వారు దేశం విడిచి వెళ్లేందుకు వీలులేదు. గతంతో వీరంతా స్వదేశానికి వెళ్లాల్సి వచ్చేది. అయితే, తాజా కార్యక్రమం కింద 20వేల మందిని ఎలా ఎంపిక చేస్తారనే విషయాన్ని అమెరికా అధికారులు వెల్లడించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని