Pakistan: ఇమ్రాన్‌ను ప్రధానిగా చూడొద్దు.. ఆయన వల్ల పాక్‌ ప్రజలకు ప్రభుత్వమే లేదు..!

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.

Published : 10 Apr 2022 01:28 IST

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఆ నిమిత్తమై సమావేశమైన జాతీయ అసెంబ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలతో వాయిదా పడింది. దాంతో తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించడం కుదరలేదు. దీనిపై విపక్ష నేత మరియమ్ నవాజ్ సామాజిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘తెలివిలేని వ్యక్తి ఇకపై ఈ దేశంలో విధ్వంసం సృష్టించేందుకు మేం ఏ మాత్రం అంగీకరించం. ఇది జోక్ కాదు. ఆయన్ను ప్రధానిగా, మాజీ ప్రధానిగా పరిగణించకూడదు. తన అధికారాన్ని కాపాడుకునేందుకు దేశం మొత్తాన్ని బందీగా ఉంచిన ఒక మానసిక వ్యాధిగ్రస్తుడిగా ఆయన్ను చూడాలి. ఆ తీరు వల్ల దేశం మొత్తం స్తంభించిపోయింది. 22 కోట్ల మంది ప్రజలు కొన్ని వారాలుగా ప్రభుత్వం లేకుండా ఉండిపోయారు. ఇది సిగ్గుచేటు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికే వస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం దారుణం’ అంటూ ఆమె నెట్టింట్లో స్పందించారు. 

విపక్షాలు ఇమ్రాన్‌ ఖాన్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన దగ్గరి నుంచి పాక్‌లో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. సుప్రీం తీర్పుతో ఆ తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించేందుకు ఈ రోజు ఉదయం జాతీయ అసెంబ్లీ సమావేశమైంది. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రగడతో సభవాయిదా పడింది. రాత్రి ఎనిమిది గంటలకు ఓటింగ్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు