Ankur Jain: WWE మాజీ మహిళా రెజ్లర్‌ను పెళ్లాడిన టెక్‌ సీఈఓ

WWE మాజీ మహిళా రెజ్లర్‌ ఎరికా హమ్మండ్‌ను బిల్ట్ రివార్డ్స్ సీఈఓ అంకుర్ జైన్ వివాహం చేసుకున్నారు. వీరికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

Published : 28 Apr 2024 17:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెక్‌ బిలియనీర్‌, ‘బిల్ట్ రివార్డ్స్’ సీఈఓ అంకుర్ జైన్ (Ankur Jain).. వరల్డ్ రెజ్లింగ్‌ ఎంటర్‌టైన్‌మెంట్ (WWE) మాజీ మహిళా రెజ్లర్‌ ఎరికా హమ్మండ్‌ (Erika Hammond) వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈజిప్టులో ఈ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఏప్రిల్‌ 26నే వివాహం జరగ్గా.. పెళ్లి ఫొటోలు తాజాగా నెట్టింట వైరల్‌గా మారాయి.

‘‘మా జీవితాల్లో ఈ వేడుక ఎంతో ప్రత్యేకంగా ఉండాలనుకున్నాం. అందుకు ఎక్కువ ఖర్చు లేకుండా సాధారణంగా వివాహం చేసుకున్నాం. డెకరేషన్ల కోసం వేల డాలర్లు ఖర్చు చేయడం ఎందుకు? ప్రపంచంలోనే భిన్నమైన వాతావరణంలో వేడుక చేసుకోవడం కొత్త అనుభూతినిస్తోంది’’ అని అంకుర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. 

MH370 మిస్సింగ్‌లో ఏలియెన్స్‌ ఆధారాలు?.. ఎలాన్‌ మస్క్‌ ఏమన్నారంటే..

అయితే, పిరమిడ్‌ ప్రాంతంలో జరిగిన ఈ వివాహానికి వధూవరులు చేరుకోవడంలో జాప్యం చోటు చేసుకుంది. వారి ప్రైవేట్‌ ఈజిప్ట్‌ ఎయిర్‌ విమాన ప్రయాణంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే అందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో మూడు గంటలు ఆలస్యమైంది. ఈ వేడుకకు ప్రముఖ వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు హాజరైనట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు