Viral Video: 27వ అంతస్తుపై పిల్లల ప్రమాదరకర స్టంట్స్.. చూస్తేనే గుండె గుబేల్..!
Viral Video: 27 అంతస్తుల భవనాలపై ఇద్దరు పిల్లలు ప్రమాదకరంగా అటు ఇటూ దూకుతూ ఆకతాయి చేష్టలకు పాల్పడ్డారు. చూస్తూనే గుండె గుబేల్‌మనేలా ఉన్న ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ఎత్తైన ఆకాశహర్మ్యాలపై ఇద్దరు పిల్లలు అత్యంత ప్రమాదకర విన్యాసాలు చేసిన వీడియో తాజాగా బయటకు రావడం సంచలనం సృష్టిస్తోంది. 27 అంతస్తులున్న రెండు భవనాలపై అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు దూకారు. వింటేనే ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన చైనా (China)లో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వివరాల ప్రకారం.. (Viral Video)
చైనా (China)లోని హుబే ప్రావిన్స్‌లో జరిగిందీ ఘటన. ఇద్దరు మైనర్ బాలురు 27వ అంతస్తులున్న భవనం పైకెక్కారు. అంతే ఎత్తులో పక్కనే మరో భవనం ఉంది. వీరు ఈ భవనాలపై అటూ.. ఇటూ ప్రమాదకరంగా దూకారు. ఓ వ్యక్తి వీరిని గమనించి.. మేనేజ్‌మెంట్‌కు సమాచారమివ్వడంతో వారు ఆ పిల్లలను సురక్షితంగా కిందకు దించారు. నిజానికి ఈ ఘటన 2021లో చోటుచేసుకోగా.. అందుకు సంబంధించిన వీడియోను ఓన్లీబ్యాంగర్స్ అనే ట్విటర్ ఖాతాలో బుధవారం పోస్టు చేయడంతో ఇది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది.
ఆ వీడియో (Viral Video)లో పిల్లలిద్దరూ భవనాల పైనుంచి దూకుతూ కన్పించారు. వీడియో తీస్తున్న వ్యక్తి భవనాలను ఎత్తును చూపిస్తూ వారి స్టంట్స్ ఎంత ప్రమాదకరంగా ఉన్నాయో చెప్పారు. ఇప్పటికే ఈ వీడియోను 23లక్షల మందికి పైగా వీక్షించారు. గుండె గుబేల్‌మనేలా ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇలాంటి విన్యాసాలు వద్దని హెచ్చరిస్తున్నారు.
నిజమే మరి.. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు ప్రాణాలపైకి తీసుకురావడమే గాక.. ఒక్కోసారి తీరని నష్టాన్ని కూడా మిగుల్చుతాయి..!
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం కోర్టు ఆదేశాలనే మార్చేశారు.. పోలీసు కేసు పెట్టాలని ధర్మాసనం ఆదేశం
-
సిబ్బందిని మందలించిందని.. వ్యాపార భాగస్వామిని చితకబాదాడు..
-
అప్పుడు హమాలీ.. ఇప్పుడు వడ్రంగి
-
వరద నీటిలో కొట్టుకుపోయిన 190 పశువులు
-
భారతీయులకు వీసాల జారీలో అమెరికా రికార్డు..!
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్