Mahabubnagar: పట్టాలెక్కని ప్రాజెక్టులు.. రైళ్లు రాక అభివృద్ధి కరవు

సరైన రైల్వే సౌకర్యాలు లేక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదు. ఉమ్మడి జిల్లాలోని నాగర్‌కర్నూల్‌కు అసలు రైలు సౌకర్యమే లేదు. జిల్లా కేంద్రమైన నారాయణపేటకు రైలే రాదు. వికారాబాద్-కృష్ణా, గద్వాల-మాచర్ల, జడ్చర్ల-నంద్యాల లాంటి నూతన రైలు మార్గాలకు ప్రతిపాదనలున్నా సర్వేలకు పరిమితం అవుతున్నాయే తప్ప పట్టాలెక్కడం లేదు. ఉన్న రైల్వేలైన్లలోనూ డబ్లింగ్, విద్యుదీకరణ, రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడల్లా రైల్వే ప్రాజెక్టులు రాజకీయ పార్టీలకు ప్రచారాస్త్రాలుగా మారుతున్నాయే తప్ప కార్యరూపం దాల్చడం లేదు. 

Published : 11 Apr 2024 09:48 IST

Tags :

మరిన్ని