KKR vs RCB: బెంగళూరు ౧౨౩ ఆలౌట్‌.. ౮౧ పరుగుల తేడాతో కోల్‌కతా విజయం

ఐపీఎల్‌ ౨౦౨౩ సీజన్‌లో కోల్‌కతా ఘనంగా బోణీ కొట్టింది. బెంగళూరును ౮౧ పరుగుల తేడాతో చిత్తు చేసి మరీ పాయింట్ల ఖాతాను తెరిచింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీ ౨౦ ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి ౨౦౪ పరుగులు చేసింది. శార్దూల్‌ ఠాకూర్ (౬౮), గుర్బాజ్ (౫౭), రింకు సింగ్ (౪౬) రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో బెంగళూరును కోల్‌కతా బౌలర్లు చిత్తు చేశారు. వరుణ్ చక్రవర్తి (౪/౧౫), సుయాష్‌ శర్మ (౩/౩౦), సునీల్ నరైన్ (౨/౧౬) దెబ్బకు బెంగళూరు ౧౭.౪ ఓవర్లలో ౧౨౩ పరుగులకే ఆలౌటైంది. శార్దూల్‌ ఠాకూర్‌ హాఫ్‌ సెంచరీతోపాటు బౌలింగ్‌లో ఒక వికెట్‌ తీశాడు.

Updated : 06 Apr 2023 23:16 IST