You majared in What: ఒత్తిడికి దూరంగా కెరియర్ ప్రయాణం

నేటి తరానికి కెరియర్ మార్గదర్శకత్వంపై వినూత్న దృక్పథాన్ని అందిస్తుంది... క్యాథరిన్ బ్రూక్స్ రచించిన ‘యూ మేజర్డ్ ఇన్ వాట్?’. విద్యా నేపథ్యం ఏదైనప్పటికీ తమ బలాలూ, అభిరుచులూ, లక్ష్యాలను కెరియర్‌తో ఎలా అనుసంధానించుకోవాలో తెలిపే శక్తిమంతమైన సాధనమీ పుస్తకం.
సంప్రదాయ కెరియర్ కౌన్సెలింగ్‌కు భిన్నంగా ఈ పుస్తకం ఓ ప్రత్యేకమైన ‘కెరియర్ల గందరగోళ సిద్ధాంతా’న్ని పరిచయం చేస్తుంది. కెరియర్ అనేది సాఫీగా ఉండే ప్రయాణం కాదు. ఊహించని మలుపులూ, అనుభవాలూ, అవకాశాలతో నిండిన సంక్లిష్టమైన, గతిశీల (డైనమిక్) ప్రక్రియ. యువత తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా కెరియర్ ప్రయాణంలో ఎదురయ్యే సవాళ్లను స్వీకరించాలనీ, వాటిని అవకాశాలుగా మార్చుకోవాలనీ ఈ సిద్ధాంతం ప్రోత్సహిస్తుంది. విద్యాభ్యాసం, పని అనుభవం, వ్యక్తిగత ఆసక్తులను బలమైన కెరియర్ పథంగా ఎలా మార్చవచ్చో దీనిలో వివరిస్తారు.
- అకడమిక్ మేజర్ అంటే దేనికోసం వృత్తివిద్యా కోర్సులో నైపుణ్యం పొందామో.. ఆ విషయం. ఉదాహరణకు మెకానికల్ ఇంజినీరింగ్, ఇంగ్లిష్ సాహిత్యం, చరిత్ర, ఏఐ సమ్మిళిత కంప్యూటర్ సైన్స్ లాంటివి. మనం కోర్సుల్లో నేర్చుకున్న మేజర్ సబ్జెక్టుతో సంబంధం లేకుండా కూడా మన కెరియర్‌ను మలుచుకోవచ్చని రచయిత్రి వివరిస్తారు.
 - ఈ పుస్తకంలోని ప్రధానాంశం- కెరియర్‌ను ఇతరులకు సమర్థంగా వివరించగల నైపుణ్యాన్ని గ్రహించడం. ఏ సబ్జెక్టు చదివినా ప్రతి అనుభవం, కోర్సు, ప్రాజెక్టుల నుంచి పొందిన నైపుణ్యాలను గుర్తించేలా చేస్తుందీ రచన.
 - విద్యార్థుల కోసం ఈ పుస్తకం అందించే ముఖ్యమైన పాఠాలు అనేకం. మొదటిది- మేజర్ (చదువుకున్న ప్రధానాంశం) మాత్రమే కెరియర్‌ను నిర్ణయించదని గ్రహించడం. కళాశాల విద్య అనేది ఒక నిర్దిష్ట ఉద్యోగానికి సిద్ధం చేయడానికి మాత్రమే ఉద్దేశించినది కాదు. అది జీవితకాలం నేర్చుకోవడానికీ, స్వీయ అభివృద్ధికీ పునాది వేస్తుంది. అకడమిక్ మేజర్‌తో పాటు తరగతి బయట పాల్గొనే అన్ని కార్యకలాపాలూ, ఇంటర్న్‌షిప్‌లూ, స్వచ్ఛంద సేవలూ, హాబీలూ కెరియర్ నిర్మాణంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి.
 - విద్యార్థులు భవిష్యత్తు గురించి భయపడకుండా తమ బలాన్ని గుర్తించడానికీ, బదిలీ చేయగల నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికీ ఈ పుస్తకం కొన్ని సాధనాలూ, అభ్యసనాలను అందిస్తుంది. ఆన్‌లైన్‌లో ప్రొఫైల్ ఎలా నిర్మించుకోవాలి, నెట్‌వర్కింగ్, సమాచారం, ఇంటర్వ్యూలు ఎలా నిర్వహించాలి లాంటి అంశాలపై విలువైన సూచనలు ఇస్తుంది.
 - కొత్తగా కెరియర్ ప్రారంభించే యువతకు.. ముఖ్యంగా మొదటి ఉద్యోగంతో సంతృప్తి చెందనివారికి కూడా ఈ పుస్తకం స్ఫూర్తినిస్తుంది. తొలి కొలువు జీవితాంతం కొనసాగేది కాకపోవచ్చనీ, కెరియర్ ప్రయాణంలో అదో భాగం మాత్రమేననీ భరోసా ఇస్తుంది. మొదటి ఉద్యోగంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకుని, మరో రంగంలోకి ఎలా మారవచ్చో, కెరియర్ మార్గాన్ని ఎలా మార్చుకోవచ్చో సూచిస్తుంది. మార్పునూ, అనిశ్చితిని ధైర్యంగా ఎదుర్కొనే మనస్తత్వాన్నీ పెంచుతుంది. విద్య, పని, జీవితాల మధ్య ఉన్న సంబంధాన్ని లోతుగా అర్థం చేసుకునేలా చేసి, ఎవరి ప్రయాణానికి వారే నాయకత్వం వహించే శక్తినిస్తుంది. కెరియర్ ప్రణాళికను ఒత్తిడితో కూడిన పనిగా కాకుండా ఆసక్తికరమైన స్వీయావిష్కరణ ప్రయాణంగా మారుస్తుంది.
 
‘యూ మేజర్డ్ ఇన్ వాట్?’ కళాశాల విద్యార్థులకే కాదు.. కెరియర్లో మార్పు కోరుకునేవారికీ, నైపుణ్యాలూ, అభిరుచులను కెరియర్‌తో అనుసంధానించుకోవాలనుకునేవారికీ ఉపకరిస్తుంది. ఇది సూచించిన మార్గంలో పయనిస్తే కెరియర్ ప్రణాళికాబద్ధమైన, నిశ్శబ్ద ప్రయాణంలా కాకుండా, వ్యక్తిగత అభివృద్ధినీ, సంతృప్తినీ కలిగించే ఉత్సాహభరితమైన సాహసంగా మారుతుంది.
- మీరు చరిత్ర చదివితే దానిలో పరిశోధన నైపుణ్యాలు, విశ్లేషణాత్మక ఆలోచనలు, క్లిష్ట సమాచారాన్ని అర్థం చేసుకునే సామర్థ్యం నేర్చుకుంటారు. ఇవి మార్కెట్ రిసెర్చ్, డేటా అనాలిసిస్ లాంటి రంగాలకు ఎలా ఉపయోగపడతాయి? తత్వశాస్త్రం చదివినవారు తమ తార్కిక ఆలోచనా శక్తిని సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో, ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్‌లో ఎలా ఉపయోగించుకోవచ్చు? ఇవన్నీ ఈ పుస్తకం వివరిస్తుంది.
 - మీ మేజర్ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను వివిధ రంగాలకు ఎలా అన్వయించవచ్చో స్పష్టం చేస్తుంది. రెజ్యూమెను కేవలం అర్హతల జాబితాగా కాకుండా మీ ప్రత్యేకమైన సామర్థ్యాలనూ, విలువలనూ తెలిపే కథనంగా మార్చడానికిది సహాయపడుతుంది.
 
రహ్మాన్ ఖీ సంపత్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్గఢ్లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


