Career: ఇష్టారీతి కామెంట్లతో కెరియర్ కష్టాలు
కార్పొరేట్ స్కిల్స్

కార్పొరేట్ కొలువును ఆశించే విద్యార్థులూ, కొత్తగా కార్పొరేట్ రంగంలో అడుగుపెడుతున్న యువ ఉద్యోగులూ తెలుసుకోవలసినవి కొన్ని ఉన్నాయి. ఆ అంశాలను గమనించి తగిన లక్షణాలను అలవర్చుకుంటే వారి కెరియర్ వృద్ధికి ఎలాంటి ఢోకా ఉండదు!
ఒక బహుళజాతి సంస్థ పాతిక మంది యువ గ్రాడ్యుయేట్లను మేనేజ్‌మెంట్ ట్రెయినీగా తీసుకుంది. ఇండక్షన్ ప్రోగ్రాంలో వారి పరిచయాలూ, లక్ష్యాలు, ఈ సంస్థను ఎంచుకోవడంలో వారి ఉద్దేశాలను అడిగారు. రాజేష్ యథాలాపంగా ‘ఇక్కడ నేను ఎందుకు చేరాను? నాకే తెలియదు. మీరు వచ్చారు సెలెక్ట్ చేసుకున్నారు, ఇక్కడికి వచ్చాను’ అంటూ సరదాగా పంచ్ డైలాగ్స్‌తో తన పరిచయం ముగించాడు. రాజేష్‌కు కాలేజీలో ‘పంచ్ మాస్టర్’ అని నిక్ నేమ్ ఉంది. కానీ కంపెనీలో అతడి చిలిపి వ్యాఖ్యలు కెరియర్‌పై ప్రభావం చూపాయి. సీనియర్ మేనేజ్‌మెంట్‌కు అతడిపై ప్రతికూల భావన ఏర్పడిపోయింది.
1 మాట తీరు ముఖ్యం

ఉద్యోగులు ఉన్నతాధికారులతో జరిపే సంభాషణల్లో మాట్లాడే ప్రతి మాటకూ విలువ, ప్రయోజనం ఉంటాయి. మనసులోని ఉద్దేశాల కన్నా మాట్లాడే మాట అధిక ప్రభావం చూపిస్తుందని గ్రహించాలి. అసందర్భంగా చేసే చిన్న కామెంట్ కూడా ఉద్యోగి కెరియర్‌పై ప్రభావాన్ని చూపిస్తుంది. సంభాషణల్లో ఉచ్చారణ శైలి, స్వర మార్పు (మాడ్యులేషన్), హావభావాలూ ప్రధానమే. ఒక మాటతో నమ్మకం పొందొచ్చు. మరో మాటతో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఉంటుంది.
శ్రేయ క్వాలిటీ అస్యూరెన్స్ విభాగంలో ట్రెయినీగా చేరింది. రివ్యూ మీటింగ్‌లో క్వాలిటీ మేనేజర్ ఒక వినియోగదారుడి ఫిర్యాదును పరిష్కరించేందుకు కొన్ని సూచనలు చేశారు. శ్రేయ తనలో తాను మాట్లాడుకుంటున్నట్లు, ‘ఏదో సలహా ఇవ్వాలి కనుక ఇచ్చినట్లుంది, ఇది ఏ మాత్రం ఆలోచన లేని సలహా. అయినా బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ కదా..’. అంది అప్రయత్నంగా, కాస్త వెటకారం ధ్వనించే గొంతుతో! ఈ మాటలు మేనేజర్ చెవిన పడ్డాయి. అప్పటినుంచి ఆమెకు ఎలాంటి ప్రాజెక్టూ అలాట్ కాలేదు.
2 పొరపాట్ల నుంచి పాఠాలు

కొన్ని ప్రాజెక్టులు చేస్తున్నప్పుడు సహజంగా జరిగే పొరపాట్లను విశ్లేషించాలి. వాటినుంచి పాఠాలు నేర్చుకుని, జరిగిన పొరపాటు పునరావృతం కాకుండా చూడటం మంచి లక్షణం. తప్పులు స్వీకరించి ధైర్యంగా నిలబడగలగాలి. మాటల్లో ధైర్యం, ఆలోచనల్లో స్పష్టత కనిపించకపోతే ఉద్యోగి ఉద్దేశాలపై సీనియర్లకు అపనమ్మకం ఏర్పడుతుంది.
కస్టమర్ ప్రజెంటేషన్లో పొరపాటు జరిగిందనీ, అది కొనసాగితే కంపెనీ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందనీ ట్రెయినీ ఎగ్జిక్యూటివ్ రాహుల్ భావించాడు. తన వైపు నుంచి జరిగిన చిన్న పొరపాటును సరి చేసుకుని చర్చించడానికి రెండు గంటల సమయం అవసరమని తెలిపాడు. మరో అవకాశం తీసుకొని తన పొరపాటును సవరించుకొని విజయవంతంగా ప్రజెంటేషన్ చేశాడు. అతడి నిజాయతీనీ, ఆలోచనల్లోని స్పష్టతనూ యాజమాన్యం, వినియోగదారులూ అభినందించారు.
3 పరిజ్ఞానంతో పాటు ప్రవర్తన

ఏ అభ్యర్థులైనా సంబంధిత ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యం, పరిజ్ఞానం పెంచుకోవాలి. ఈ లక్షణాలు సంస్థలో ఉద్యోగం సంపాదించటానికి మాత్రమే ఉపకరిస్తాయి. ప్రవర్తనా ధోరణీ, మనోవైఖరీ సంస్థలో ఉద్యోగిగా కొనసాగడానికి సహకరిస్తాయి. అంటే సంస్థ వాతావరణానికి సర్దుబాటయ్యే ప్రవర్తన ధోరణి, వైఖరి ఉన్నవారే ఉద్యోగులుగా విజయం సాధించగలరు. ఉన్నత స్థాయికీ చేరుకోగలరు.
4 ప్రొయాక్టివ్‌గా వ్యవహరించండి

ఏదైనా ఒక సంఘటన జరిగాకో, సమస్య ఉత్పన్నమయ్యాకో దానికి పరిష్కారం వెతుక్కోకూడదు. ఆ సమస్య రాకుండా ముందుస్తుగానే చూసుకోవాలి. ఇలా ప్రొయాక్టివ్‌గా ఉండే ఉద్యోగులు ఎవరూ చెప్పకముందే తమ బాధ్యతలు గ్రహించి తమ పని మొదలుపెడతారు.
సహోద్యోగి సమస్యలో ఉంటే ‘ఇది నా పని కాదు’ అని దూరంగా వెళ్లిపోకుండా, దాన్ని పరిష్కరించేందుకు అవసరమైన సహాయం చేయడం ప్రొయాక్టివ్ లక్షణం. ఈ గుణం ఎవరినైనా విజయవంతమైన టీమ్ ప్లేయర్ని చేస్తుంది. ప్రొయాక్టివ్ ఆలోచన ధోరణి ఉన్నవారు కెరియరో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి మార్గం సులభమవుతుంది.
తన టీమ్ లీడర్ సెలవులో ఉన్నప్పుడు, క్లయింట్స్ నుంచి వచ్చే ఈ-మెయిల్స్‌ను ఎవరూ ట్రాక్ చేయలేకపోతున్నారని గమనించింది సునీత. తాను తాత్కాలికంగా క్లయింట్ కమ్యూనికేషన్స్ హ్యాండిల్ చేస్తానని సీనియర్ అనుమతి తీసుకొంది. క్లయింట్స్ మెయిల్స్‌కు సమాధానాలు ఇవ్వడంతో పాటు క్లయింట్‌కు ఎదురైన ఓ చిన్న సమస్యనూ పరిష్కరించింది. ప్రశంసలందుకుంది. సునీత ప్రొయాక్టివ్‌నెస్‌ను యాజమాన్యం గుర్తించడంతో ఆమెకు కెరియర్లో మంచి అవకాశాలు వచ్చాయి.

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

గచ్చిబౌలిలో భారీగా డ్రగ్స్ పట్టివేత
 - 
                        
                            

ఆయనను భారత్‌కు డిపోర్ట్ చేయొద్దు.. వేదం సుబ్రహ్మణ్యంకు అమెరికాలో ఊరట
 - 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

ఎయిర్పోర్ట్ వద్ద యువతిపై గ్యాంగ్ రేప్.. పారిపోతుండగా నిందితులపై కాల్పులు
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 


