Self Pity: సెల్ఫ్ పిటీ వద్దు.. పోటీ పడండి!

స్నేహితులందరూ మంచి కాలేజీల్లో చదువుతున్నారు. వాళ్లందరికీ మంచి ర్యాంకులు వస్తున్నాయి. ఫీజులు తక్కువని ఎలాంటి సౌకర్యాలూ లేని చిన్న కాలేజీలో నన్ను చేర్చారు. నాకెక్కడి నుంచి వస్తాయి మంచి మార్కులు?’ అని ఇతరులతో పోల్చుకుంటూ సెల్ఫ్ పిటీతో బాధపడుతుంటారు కొందరు విద్యార్థులు.
ఇతరులతో పోల్చుకోవడం, ఆత్మవిశ్వాస లేమి, ప్రతికూల ఆలోచనల వల్ల స్వీయ సానుభూతి పెరిగిపోతుంది. ఇదే అలవాటుగా మారితే చదువులో వెనకబడే పరిస్థితి ఎదురవుతుంది.
- అందరూ చక్కగా ఉన్నారు. ఆటంకాలు, కష్టాలన్నీ నాకే. ఈ పరిస్థితుల్లో ఎవరు ఉన్నా ఇంతకంటే బాగా చదవలేరు..’ అని మీ పైన మీరే సానుభూతి చూపించడం మొదలుపెడితే.. కొంతకాలానికి అదే అలవాటుగా మారుతుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అడుగు ముందుకు వేయలేరు.
 - ప్రతికూల పరిస్థితులకు ఎదురువెళ్లడం నేర్చుకోవాలి. వాటిని సవాలుగా తీసుకుని పోరాడటానికి శాయశక్తులా ప్రయత్నించాలి. ఆటంకాలన్నీ మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాలుగానే భావించాలి.
 - ‘తోటివాళ్లందరికీ చదువుకోవడానికి రీడింగ్ రూమ్‌లు ఉన్నాయి. కుటుంబ సభ్యులెవరు వాళ్లకు చిన్న పని కూడా చెప్పరు. మాకున్నవి రెండే గదులు. ఇంటి పనుల్లో సాయం చేస్తూనే చదువుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో నేను కాబట్టి చదవగలుగుతున్నాను.’ అని స్వీయ సానుభూతిని చూపిస్తే సానుకూల ఫలితాలను అందుకోలేరు. ఇంట్లో మీ కోసం స్టడీ రూమ్ లేదనుకుందాం. లైబ్రరీలో కూర్చుని కూడా ప్రశాంతంగా చదువుకోవచ్చు. లేదా స్నేహితులతో కలిసి కంబైన్డ్ స్టడీ కూడా చేసుకోవచ్చు.
 
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
 - 
                        
                            

జేడీ వాన్స్ వ్యాఖ్యలు దేశంలో హిందూ వ్యతిరేకతను ఎగదోస్తున్నాయి: అమెరికన్ చట్టసభ సభ్యుడు
 - 
                        
                            

విశాఖలో స్వల్ప భూప్రకంపనలు
 - 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 


