Corporate Skills: సిలబస్‌లో లేనివీ.. ఇండక్షన్‌లో చెప్పనివీ!
కార్పొరేట్ స్కిల్స్

కార్పొరేట్ కార్యాలయాల్లో విధినిర్వహణ సందర్భంగా అమలయ్యే కొన్ని ముఖ్యాంశాలు కాలేజీ సిలబస్‌లో ఉండవు. నియామకాల సందర్భంగా జరిపే ఇండక్షన్ ప్రోగ్రాంలోనూ చెప్పరు. కానీ ప్రతి ఉద్యోగార్థీ వీటిని తెలుసుకోవలసిందే!
వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ప్రాజెక్టుల విజయాలు టీమ్ వర్క్ మీద ఆధారపడి ఉంటాయి. ఒకే కాలేజి నుంచి వచ్చిన క్లాస్‌మేట్స్ ఒకే బృందంలో చేరితే వారి మధ్య ఉన్న అవగాహన, స్నేహం సంస్థ లక్ష్యాల సాధనకు సహాయపడుతుంది. అదే స్నేహం ప్రొఫెషనల్ హద్దులు దాటి వ్యక్తిగతంగా మారితే సంస్థకు నష్టదాయకం. ఒక బృందంలోని ఇద్దరు మిత్రులు తమ పరిధిని దాటి హద్దు మీరితే ఇతర సభ్యుల మధ్య అనుమానాలతో టీమ్ స్పిరిట్‌కు భంగం కలగవచ్చు.
క్లాస్‌మేట్స్ అయిన రమేష్, కిరణ్‌లు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఎంపికై ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో డెవలపర్స్‌గా చేరారు. ఇద్దరూ ఒకే టీములో ఉద్యోగులవడంతో వారి స్నేహం మరింత బలపడింది. చురుగ్గా పాల్గొంటూ తమకు కేటాయించిన ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేస్తుండటంతో వారిద్దరి మధ్య అవగాహన బాగుందని టీమ్ లీడర్, మేనేజర్‌లు అభినందించారు. టాప్ మేనేజ్‌మెంట్‌లోనూ గుర్తింపు వచ్చింది.

టీమ్ స్పిరిట్ విలువ
విద్యార్థి దశలోనో, తర్వాతో ఏర్పడే స్నేహాలు ఒకే సంస్థలో పని చేస్తున్నపుడు వారి విధులకు విలువ చేకూర్చాలి. అప్పుడే ఉద్యోగుల కెరియర్ వృద్ధి జరుగుతుంది. సంస్థ సులువుగా లక్ష్యాలు సాధిస్తుంది. టీమ్‌లోని ఇతర సభ్యుల విజయాన్ని తమ విజయంగా భావించడం టీమ్ స్పిరిట్. ఉద్యోగుల్లో టీమ్ స్పిరిట్ సానుకూలంగా ఉన్నపుడు పెద్ద పెద్ద సమస్యలు కూడా చిన్నవిగా కనిపిస్తాయి. అందుకే స్నేహాలకు టీమ్ స్పిరిట్‌తో విలువ చేకూర్చడం ముఖ్యం.

బలాన్ని బట్టి బాధ్యత
కొత్తగా ఉద్యోగంలో చేరిన యువ గ్రాడ్యుయేట్లు తమ బలాన్ని గుర్తించడంతోపాటు టీములోని ఇతర సభ్యుల బలాలనూ గుర్తించాలి. టీముకు ఒక ప్రాజెక్ట్ అప్పగించినప్పుడు.. ఆ ప్రాజెక్ట్ విజయానికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించాలి. సభ్యుల్లో ఏయే ఉద్యోగి ఏ అంశంలో నిపుణుడో పరిశీలించాలి. విశ్లేషణలో ఎవరు బలమైనవారు, కమ్యూనికేషన్‌లో మెరుగైనవారు ఎవరు, డిజైనింగ్‌లో సృజనాత్మకత చూపించగల సభ్యులెవరు.. ఇలా ప్రాజెక్టు విజయానికి అవసరమైన నైపుణ్యాల్లో ఎవరెవరు వేటిలో నిపుణులో గుర్తించి పనిని విభజించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. నాణ్యత మెరుగై సమష్టి విజయం సాధ్యమవుతుంది.
అయితే క్రమంగా ఒకరి పని మరొకరు చేయడం, ఒకరి పొరబాట్లు మరొకరు కవర్ చేసుకోవడం మొదలైంది. పనిలో నిర్లక్ష్యంతో వీరి ప్రాజెక్టుల డెలివరీ షెడ్యూల్స్ మిస్ అయ్యి, కస్టమర్ ఫిర్యాదులు పెరిగాయి. వీరి ప్రవర్తనతో ఇతర టీమ్ సభ్యుల్లో అసంతృప్తి పెరిగింది. వృత్తికీ, స్నేహానికీ మధ్య హద్దు ఉండాలని మేనేజర్ వీరికి కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ పనిలో, ప్రవర్తనలో మార్పు రాలేదు. కస్టమర్ల ప్రతికూల ఫీడ్ బ్యాక్‌కు తోడు సంస్థ ప్రతిష్ఠకు నష్టం వాటిల్లుతుండటంతో యాజమాన్యం వీరిద్దరినీ రెండు వేర్వేరు బ్రాంచిలకు బదిలీ చేసింది.
వృత్తి, వ్యక్తిగత జీవితాలకు మధ్య స్పష్టమైన సరిహద్దు ఉన్నంత వరకూ విధుల నిర్వహణలో సమస్యలు ఎదురు కావు.

స్వీయ అభిప్రాయాలు
ఒక బహుళజాతి సంస్థలో ట్రెయినీగా చేరిన సుజాత తన టీములో ఇద్దరితో స్నేహంగా మెలిగేది. ఒక కొత్త ప్రాజెక్టుకు ప్రణాళిక రూపొందించే విషయంలో మేధామథ]నం జరుగుతోంది. బృంద సభ్యులు తమ ఆలోచనలూ, పరిష్కార మార్గాలను సూచించారు. సుజాత తన మిత్రుడు తెలిపిన పరిష్కారాన్నే తానూ చెప్పి, బలపరిచింది. ఆమె ఇన్‌పుట్స్‌తో సమస్య పరిష్కారానికి ఎలాంటి విలువా చేకూరలేదని భావించారు టీమ్ లీడర్. ఆమెను నాన్ ప్రొడక్టివ్ మెంబర్ అని రిపోర్ట్ చేసి ఏకంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. అందుకే.. వృత్తిపరమైన అంశాల్లో నిష్పక్షపాతంగా చర్చించటం, శ్రద్ధగా స్వీయాభిప్రాయాలను తెలపడం చాలా ముఖ్యం.

దొరైరాజ్
సీనియర్ జనరల్ మేనేజర్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్ 
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా..
 - 
                        
                            

అబుధాబి లాటరీలో రూ.60 కోట్లు గెలుచుకున్న భారతీయుడు
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/11/2025)
 - 
                        
                            

భారత్ సాయంతోనే తిరుగుబాటు భగ్నం.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

ఆ క్షణాలు ఇంకా వెంటాడుతున్నాయి: ఎయిరిండియా ప్రమాద మృత్యుంజయుడు
 


