నోటిఫికేషన్స్

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ...అగ్నిపథ్‌ స్కీం ద్వారా అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 15 Feb 2024 16:39 IST

ఉద్యోగాలు

ఇండియన్‌ నేవీలో 200 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ...అగ్నిపథ్‌ స్కీం ద్వారా అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
* అగ్నివీర్‌ (మెట్రిక్‌ రిక్రూట్‌) - 01/ 2022 బ్యాచ్‌
పోస్టులు: చెఫ్‌, స్టీవార్డ్‌, హైజీనిస్ట్‌ మొత్తం పోస్టులు: 200  అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత. వయసు: 01 డిసెంబరు 1999 - 31 మే 2005 మధ్య జన్మించి ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ (పీఎఫ్‌టీ), మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, జులై 25. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 30.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నెట్‌

దేశవ్యాప్తంగా సైన్స్‌, తత్సమాన కోర్సులకు సంబంధించి జేఆర్‌ఎఫ్‌ అండ్‌ లెక్చర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతకు నిర్వహించే జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌-యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (నెట్‌) జూన్‌ 2022 ప్రకటనను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసింది.
పరీక్ష నిర్వహించే విభాగాలు: కెమికల్‌ సైన్సెస్‌, ఎర్త్‌, అట్మాస్పియరిక్‌, ఓషన్‌ అండ్‌ ప్లానిటరీ సైన్సెస్‌, లైఫ్‌ సైన్సెస్‌, మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజికల్‌ సైన్సెస్‌. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఎమ్మెస్సీ/ ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌ఎంఎస్‌/ నాలుగేళ్ల బీఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత. ఎంపిక: ఉమ్మడి జాతీయ అర్హత పరీక్ష (నెట్‌) ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 10.08.2022. పరీక్ష తేదీలు: వెల్లడించాల్సి ఉంది. 
వెబ్‌సైట్‌:https://csirnet.nta.nic.in/


ఐఐటీఎంలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ మంత్రిత్వశాఖకు చెందిన పుణెలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ మెటియోరాలజీ (ఐఐటీఎం) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 56 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్టులు, ప్రోగ్రాం మేనేజర్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు, టెక్నికల్‌ అసిస్టెంట్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేదీ: 2022, ఆగస్టు 05.
వెబ్‌సైట్‌: www.tropmet.res.in/


నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లో....

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌జీటీ) సంస్థ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 27 పోస్టులు: అసిస్టెంట్లు, స్టెనోగ్రాఫర్లు, లైబ్రేరియన్లు, హిందీ ట్రాన్స్‌లేటర్‌, స్టాఫ్‌ కార్‌ డ్రైవర్లు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌/ స్కిల్‌ టెస్ట్‌/ ఇంటరాక్షన్‌ ఆధారంగా. దరఖాస్తు: ఈమెయిల్‌ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: 2022, జులై 25.

వెబ్‌సైట్‌: https://greentribunal.gov.in/


వాక్‌ఇన్‌

ఎయిమ్స్‌, మంగళగిరిలో...

భారత ప్రభుత్వానికి చెందిన మంగళగిరి (ఏపీ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది. ః జూనియర్‌ రెసిడెంట్లు (నాన్‌ అకడమిక్‌) మొత్తం పోస్టులు: 14 అర్హత: ఎంబీబీఎస్‌/ తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్న్‌షిప్‌ చేసి ఉండాలి. వయసు: 33 ఏళ్లు మించకుండా ఉండాలి. వాక్‌ఇన్‌ తేదీ: 2022, జులై 29. వేదిక: గ్రౌండ్‌ఫ్లోర్‌, అడ్మిన్‌ అండ్‌ లైబ్రరీ బిల్డింగ్‌, ఎయిమ్స్‌ మంగళగిరి, ఏపీ.

వెబ్‌సైట్‌: www.aiimsmangalagiri.edu.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని