నోటిఫికేషన్స్

భారత నౌకాదళం... 217 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 15 Feb 2024 16:33 IST

ఉద్యోగాలు

భారత నౌకాదళంలో 217 ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్‌లు

భారత నౌకాదళం... 217 షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో బీటెక్‌, బీఈ, బీఎస్సీ, బీకాం, బీఎస్సీ(ఐటీ), పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ(ఐటీ), కమర్షియల్‌ పైలెట్‌ లైసెన్స్‌ ఉత్తీర్ణతతో పాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు ఉండాలి.
ఎంపిక: డిగ్రీ, పీజీలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, మెడికల్‌ స్టాండర్డ్స్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 06-11-2022.

వెబ్‌సైట్‌: https://www.joinindiannavy.gov.in/


ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, సూపర్‌వైజర్‌ పోస్టులు

బెంగళూరులోని భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌, ఎలక్ట్రానిక్స్‌ డివిజన్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌, ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ప్రాజెక్ట్‌ ఇంజినీర్‌: 14 పోస్టులు నీ ప్రాజెక్ట్‌ సూపర్‌వైజర్‌: 16 పోస్టులు విభాగాలు: మెకానికల్‌, ఎలక్ట్రికల్స్‌, ఎలక్ట్రానిక్స్‌
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా/ బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం.
వయసు: 01.11.2022 నాటికి 32 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: డిగ్రీ/ డిప్లొమాలో సాధించిన మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు గడువు: 15.11.2022.
దరఖాస్తు హార్డ్‌ కాపీ పోస్టులో స్వీకరించడానికి చివరి తేదీ: 18.11.2022.

వెబ్‌సైట్‌: https://www.bhel.com/


అర్హత పరీక్ష

సెంట్రల్‌ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌)
డిసెంబర్‌-2022 ఏడాదికి సంబంధించిన సెంట్రల్‌ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (సీటెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది.  
పేపర్‌-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
పేపర్‌-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌/ బ్యాచిలర్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 31-10-2022.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-11-2022.
ఫీజు చెల్లింపు చివరి తేదీ: 25-11-2022.
కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష తేదీలు: డిసెంబర్‌, 2022 నుంచి జనవరి, 2023 మధ్య.
వెబ్‌సైట్‌: https://ctet.nic.in/


ప్రవేశాలు

అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష
33 సైనిక స్కూళ్లలో 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి ప్రవేశాల కోసం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్‌ఎస్‌ఈఈ-2023) నోటిఫికేషన్‌ విడుదలయింది.
ఎంపిక: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. అర్హులకు దేహ దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నవంబర్‌ 30, 2022 లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి.  

వెబ్‌సైట్‌: https://aissee.nta.nic.in/


అప్రెంటిస్‌

హైదరాబాద్‌ న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌లో...
హైదరాబాద్‌లోని న్యూక్లియర్‌ ఫ్యూయల్‌ కాంప్లెక్స్‌ ఏడాది అప్రెంటిస్‌ శిక్షణ కోసం ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం ఖాళీలు- 345.
అర్హత: సంబంధిత ట్రేడుల్లో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత.
వయసు: దరఖాస్తు ముగింపు తేదీ నాటికి 18 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు.
స్టైపెండ్‌: నెలకు రూ.7,700 నుంచి రూ.8,050.
ఎంపిక: పదోతరగతి/ ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-11-2022.

వెబ్‌సైట్‌: https://nfc.gov.in/recruitment.html


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని