ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో అవకాశాలు

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్‌ 28 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దర   ఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Published : 19 Feb 2024 00:54 IST

రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎఫ్‌సీఎల్‌), రామగుండం ప్లాంట్‌ 28 మేనేజ్‌మెంట్‌ ట్రైనీ పోస్టుల భర్తీకి దర   ఖాస్తులు కోరుతోంది. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ప్రకటించిన అన్ని పోస్టులకూ డిగ్రీ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు 50 శాతం సరిపోతుంది. కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండాలి. మొత్తం 28 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌కు 18, ఎస్టీలకు 01, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)కు 02, ఈడబ్ల్యూఎస్‌కు 07 కేటాయించారు. ఎంపికైన అభ్యర్థులను ఆర్‌ఎఫ్‌సీఎల్‌ యూనిట్‌/ ఆఫీసుల్లో ఎక్కడైనా నియమించవచ్చు.

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (కెమికల్‌): 10 పోస్టులు. కెమికల్‌ ఇంజినీరింగ్‌ లేదా కెమికల్‌ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పాసవ్వాలి. బాయిలర్‌ ఆపరేషన్‌ ఇంజినీర్‌ (బీఓఈ) సర్టిఫికేషన్‌ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

మెకానికల్‌: 6 పోస్టులు. అర్హత- మెకానికల్‌ ఇంజినీరింగ్‌/ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌).

ఎలక్ట్రికల్‌: 3. ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌/ ఎలక్ట్రికల్‌ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) పాసవ్వాలి.  

ఇన్‌స్ట్రుమెంటేషన్‌: 2. అర్హత- ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఇండస్ట్రియల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో బీఈ/ బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌).  

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ: 3. కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూటర్‌ టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో బీఈ/బీటెక్‌/బీఎస్సీ (ఇంజినీరింగ్‌) లేదా ఎంసీఏ.
లా: 1. అర్హత- లా డిగ్రీ లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేడెట్‌ ఎల్‌ఎల్‌బీ. కంపెనీ సెక్రెటరీ/ కార్పొరేట్‌ లాలో డిప్లొమా ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హెచ్‌ఆర్‌): 3. ఎంబీఏ/ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ/ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పాసవ్వాలి. హెచ్‌ఆర్‌ఎం/ పర్సనల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌ డిప్లొమా, లా డిగ్రీ ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.

29.02.2024 నాటికి ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు 25, ఎంబీఏ అభ్యర్థులకు 29 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు లేదు.

ప్రశ్నపత్రంలో...

  • దరఖాస్తులో తెలిపిన వివరాల ఆధారంగా అభ్యర్థులకు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (సీబీటీ)ని నిర్వహిస్తారు. సీబీటీ తేదీ, సమయం, వేదికలను అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు.
  • ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ భాషల్లో ఉంటుంది. రెండు పార్ట్‌లు ఉంటాయి. పార్ట్‌-1లో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు, పార్ట్‌-2లో ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు అడుగుతారు. వ్యవధి 2 గంటలు.  
  • మొత్తం 150 ప్రశ్నలు ఉంటాయి. విద్యార్హతల సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు 100, జనరల్‌ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ ప్రశ్నలు 50 అడుగుతారు.
  • నెగెటివ్‌ మార్కులు లేవు.
  • సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను 1:8 నిష్పత్తిలో ఇంటర్వ్యూకు పిలుస్తారు.
  • సీబీటీ, ఇంటర్వ్యూల్లో వేర్వేరుగా 50 శాతం మార్కులు సాధించాలి. కేటగిరీలవారీగా మెరిట్‌ లిస్టు తయారుచేస్తారు.

సన్నద్ధత: సబ్జెక్టు సంబంధిత పరిజ్ఞానం పెంచుకుంటే మార్కులు సాధించవచ్చు. చదివిన సబ్జెక్టుల్లోని ముఖ్యాంశాలను పునశ్చరణ చేసుకోవాలి. పార్ట్‌-2లో కనీసార్హత మార్కుల సాధనకు బ్యాంక్‌, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రాల సాధన తోడ్పడుతుంది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం
దరఖాస్తుకు చివరి తేదీ: 14.03.2024
వెబ్‌సైట్‌: https://rfcl.co.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు