ఇంజినీర్లకు ఆహ్వానం

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన 34 ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు

Updated : 21 Feb 2024 03:48 IST

బెల్‌లో నియామకాలు

ఘజియాబాద్‌లోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన 34 ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 ప్రాజెక్టు ఇంజినీర్‌ పోస్టులకు పోటీ పడాలంటే..బీఈ/ బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) ఇంజినీరింగ్‌ డిగ్రీ 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది. సీ++, ఎస్‌డబ్ల్యూ టెస్టింగ్‌, ఎస్‌డబ్ల్యూ డాక్యుమెంటేషన్‌, పైతాన్‌ నైపుణ్యంతోపాటు రెండేళ్ల ఉద్యోగానుభవం ఉండాలి.

  • కోర్సులో భాగంగా చేసిన అకాడమీ/ టీచింగ్‌/ రిసెర్చ్‌ వర్క్‌, ఇంటర్న్‌షిప్‌, ప్రాజెక్ట్‌ వర్క్‌లను అనుభవంగా పరిగణించరు. బీఈ/బీటెక్‌ పూర్తిచేసిన తర్వాత పొందిన పని అనుభవాన్ని మాత్రమే లెక్కలోకి తీసుకుంటారు.

మొత్తం 34 పోస్టుల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 13, ఓబీసీలకు 12, ఈడబ్ల్యూఎస్‌లకు 02, ఎస్సీలకు 04, ఎస్టీలకు 03 కేటాయించారు.  
01.01.2024 నాటికి అభ్యర్థుల వయసు 32 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల సడలింపు ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.472. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు మినహాయింపు ఉంటుంది.
రాత పరీక్షకు 85, ఇంటర్వ్యూకు 15 మార్కులు కేటాయించారు. రాత పరీక్షలో సబ్జెక్టు సంబంధిత ప్రశ్నలు అడుగుతారు. దీంట్లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:5 నిష్పత్తిలో అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఎంపికైన అభ్యర్థుల పేర్లను వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు. అభ్యర్థులను ప్రాథమికంగా 3 ఏళ్ల కాలానికి విధుల్లోకి తీసుకుంటారు. తర్వాత సంస్థ అవసరాలు, అభ్యర్థుల పనితీరు ఆధారంగా మరో ఏడాది పొడిగిస్తారు.

  • మొదటి సంవత్సరం నెలకు రూ.40 వేల వేతనం, రెండో ఏడాది రూ.45 వేలు, మూడో ఏడాది రూ.50 వేలు, నాలుగో ఏడాది రూ.55 వేల వేతనం చెల్లిస్తారు.  
  •  వేతనంపైన నెలకు 10 శాతం ఏరియా అలవెన్స్‌ ఉంటుంది. ఇన్సూరెన్స్‌ ప్రీమియం, స్టిచింగ్‌ చార్జీలు, ఫుట్‌వేర్‌ అలవెన్స్‌కు ఏడాదికి రూ.12 వేలు అందజేస్తారు.

గమనించాల్సినవి  

  • ఎంపిక చేసిన అభ్యర్థులను సంస్థకు చెందిన ఏ యూనిట్‌లోనైనా నియమించే అవకాశం ఉంటుంది.  
  •  విధి నిర్వహణలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రయాణించాల్సివుంటుంది.
  •  ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రత్యేక కేటాయింపులు/ సడలింపులు వర్తిస్తాయి.
  •  ప్రభుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న అభ్యర్థులు దరఖాస్తుతోపాటు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి.
  • దరఖాస్తుకు చివరి తేదీ: 01.03.2024
  • వెబ్‌సైట్‌: http://www.bel-india.in/

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని