బొగ్గు గనుల్లో కొలువులు

నవరత్న కేటగిరీకి చెందిన నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్‌ 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

Published : 18 Apr 2024 00:10 IST

దరఖాస్తులకు నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ ఆహ్వానం

నవరత్న కేటగిరీకి చెందిన నైవేలీ లిగ్నైట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎల్‌సీ) ఇండియా లిమిటెడ్‌ 34 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ప్రాతిపదికన మూడేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం 34 ఉద్యోగాల్లో.. అన్‌రిజర్వుడ్‌కు 25, ఈడబ్ల్యూఎస్‌లకు 1, ఓబీసీలకు 2, ఎస్సీలకు 2, ఎస్టీలకు 4 కేటాయించారు. ఎంపికైనవారిని ఒడిశాలోని బొగ్గు గనుల్లో నియమిస్తారు.

 1. ఇండస్ట్రియల్‌ వర్కర్‌ (డ్రాఫ్ట్స్‌మ్యాన్‌)-1: ఇంటర్మీడియట్‌, ఐటీఐ (డ్రాఫ్ట్స్‌మ్యాన్‌) పాసవ్వాలి.
2. ఇండస్ట్రియల్‌ వర్కర్‌ (ఎలక్ట్రీషియన్‌)-3: ఇంటర్మీడియట్‌, ఐటీఐ (ఎలక్ట్రీషియన్‌) ఉత్తీర్ణత.
3. ఇండస్ట్రియల్‌ వర్కర్‌     (ఫిట్టర్‌)-2: ఇంటర్మీడియట్‌, ఐటీఐ (ఫిట్టర్‌) పూర్తిచేయాలి.  
4. ఇండస్ట్రియల్‌ వర్కర్‌   (మెకానిక్‌- మోటర్‌ వెహకల్‌)-2: ఇంటర్మీడియట్‌, ఐటీఐ (మెకానిక్‌ - మోటర్‌ వెహకల్‌) ఉత్తీర్ణత.
5. ఇండస్ట్రియల్‌ వర్కర్‌    (వైర్‌మ్యాన్‌)-1: ఇంటర్మీడియట్‌, ఐటీఐ (వైర్‌మ్యాన్‌) పాసవ్వాలి.  
6. క్లరికల్‌ అసిస్టెంట్‌-17: ఏదైనా డిగ్రీ (ఫుల్‌టైమ్‌).
7. జూనియర్‌ ఇంజినీర్‌ (సివిల్‌)-5: సివిల్‌/ సివిల్‌ అండ్‌ స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైమ్‌/ పార్ట్‌టైమ్‌ డిప్లొమా పాసవ్వాలి.
8. జూనియర్‌ ఇంజినీర్‌ (మెకానికల్‌)-2: మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైమ్‌/ పార్ట్‌టైమ్‌ డిప్లొమా.
9. జూనియర్‌ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌)-1: ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌లో మూడేళ్ల ఫుల్‌టైమ్‌/ పార్ట్‌టైమ్‌ డిప్లొమా ఉత్తీర్ణత.

  • ఇండస్ట్రియల్‌ వర్కర్‌ పోస్టులకు.. అన్‌రిజర్వుడ్‌/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందినవారు 50 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీలు 40 శాతం మార్కులతో పాసవ్వాలి.
  • ఇంజినీరింగ్‌ పోస్టులకు .. అన్‌రిజర్వుడ్‌/ ఓబీసీ-ఎన్‌సీఎల్‌/ ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీలకు చెందినవారు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీలు 50 శాతం మార్కులతో పాసవ్వాలి.
    01.03.2024 నాటికి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జూనియర్‌ ఇంజినీర్‌ పోస్టులకు.. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు రూ.595. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రూ.295.

  • క్లరికల్‌ అసిస్టెంట్‌/ ఇండస్ట్రియల్‌ వర్కర్‌ పోస్టుకు.. యూఆర్‌/ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు రూ.486. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌కు రూ.236.
    ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పరీక్ష మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతో ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు. తప్పు సమాధానాలకు రుణాత్మక మార్కులు ఉండవు.
  • జూనియర్‌ ఇంజినీర్‌ ఉద్యోగాలకు: రాత పరీక్షకు 100 మార్కులు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ 30 ప్రశ్నలకు 30 మార్కులు. సబ్జెక్టు సంబంధిత 70 ప్రశ్నలకు 70 మార్కులు.
  • క్లరికల్‌ అసిస్టెంట్‌, ఇండస్ట్రియల్‌ వర్కర్‌ పోస్టులకు: పరీక్ష 100 మార్కులకు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, లాజికల్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఇస్తారు.
  • పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.
  • రాత పరీక్షలో అన్‌రిజర్వుడ్‌, ఈడబ్ల్యూఎస్‌లు 50 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) 40 శాతం మార్కులు సాధించాలి.
  • ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన కుటుంబాల వారికి 20 బోనస్‌ మార్కులు ఇస్తారు.
  • రాత పరీక్షలో కనీసార్హత మార్కులు సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి.. కేటగిరీలవారీగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేదీ: 24.04.2024
వెబ్‌సైట్‌:https://www.nlcindia.in


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని