కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (ఆర్‌సీఎఫ్‌) లిమిటెడ్‌ 158 మేనేజ్‌మెంట్‌  ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

Published : 12 Jun 2024 00:33 IST

రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫెర్టిలైజర్స్‌ (ఆర్‌సీఎఫ్‌) లిమిటెడ్‌ 158 మేనేజ్‌మెంట్‌  ట్రెయినీ పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

పోస్టులకు ఆన్‌లైన్‌ టెస్ట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. వివిధ విభాగాల్లో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ పోస్టుల సంఖ్య, వాటికి దరఖాస్తు చేయటానికి అవసరమైన అర్హతలేమిటో చూద్దాం.

1. కెమికల్‌ - 51: కెమికల్‌ ఇంజినీరింగ్‌/ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీలో నాలుగేళ్ల బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేయాలి. 
2. మెకానికల్‌- 30: మెకానికల్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 
3. ఎలక్ట్రికల్‌-27: ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 
4. ఇన్‌స్ట్రుమెంటేషన్‌-18: ఇన్‌స్ట్రుమెంటేషన్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 
5. సివిల్‌-4: సివిల్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 
6. ఫైర్‌-2: ఫైర్‌/ ఫైర్‌ అండ్‌ సేఫ్టీ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 
7. సీసీల్యాబ్‌-1: కెమిస్ట్రీ సబ్జెక్టులో పీహెచ్‌డీ చేయాలి. లేదా కెమికల్‌ ఇంజినీరింగ్‌/ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌/ కెమికల్‌ టెక్నాలజీలో బీఈ/ బీటెక్‌ పూర్తిచేయాలి. 
8. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌-3: ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌తో బీఈ/ బీటెక్‌ చేయాలి. లేదా ఏదైనా బ్రాంచ్‌తో బీఈ/బీటెక్‌ చేసి.. ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌/ ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌/ ఇండస్ట్రిల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ రిసెర్చ్‌లో పీజీ డిగ్రీ/ డిప్లొమా పాసవ్వాలి. 

9. మార్కెటింగ్‌-10: సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌ డిగ్రీ, ఎంబీఏ (మార్కెటింగ్‌)/ అగ్రికల్చర్‌ పాసవ్వాలి. లేదా సైన్స్‌/ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌ డిగ్రీ, పీజీ డిప్లొమా ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌/ అగ్రికల్చర్‌/ మార్కెటింగ్‌ పూర్తిచేయాలి. 
10. హ్యూమన్‌ రిసోర్సెస్‌-5: ఏదైనా డిగ్రీ, హ్యూమన్‌ రిసోర్స్‌/ పర్సనల్‌/ సోషల్‌ వర్క్‌/ వెల్ఫేర్‌/ ఇండస్ట్రియల్‌ రిలేషన్స్‌/ లేబర్‌ స్టడీస్‌లో మాస్టర్‌ డిగ్రీ చేయాలి. లా డిగ్రీ చేసి, మరాఠీ భాష మాట్లాడేవారికి ప్రాధాన్యం. 
11. అడ్మినిస్ట్రేషన్‌-4: ఏదైనా డిగ్రీ, ఎంబీఏ (హెచ్‌ఆర్‌)/ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌/ మాస్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ పూర్తిచేయాలి. 
12. కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌-3: ఏదైనా డిగ్రీ, మీడియా స్టడీస్, పబ్లిక్‌ రిలేషన్స్‌/ మాస్‌ కమ్యూనికేషన్‌/ జర్నలిజంలో పీజీ చేయాలి. 

 • ఇంజినీరింగ్‌ డిగ్రీని అన్‌రిజర్వుడ్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ఎస్టీలు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. 
 • రెగ్యులర్‌ అండ్‌ ఫుల్‌టైమ్‌ డ్యూయల్‌/ ఇంటిగ్రేటెడ్‌/ అలైడ్‌ డిగ్రీ పాసైనవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

01.06.2024 నాటికి అన్‌రిజర్వుడ్‌/ ఈబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 27 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు కేటగిరీని బట్టి పది నుంచి పదిహేనేళ్ల సడలింపు ఉంటుంది. 

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌లకు దరఖాస్తు ఫీజు రూ.1000 (బ్యాంక్‌ ఛార్జీలు అదనం). ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌/ మహిళలకు ఫీజు లేదు. 

పరీక్ష ఎలా?

కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ ఆబ్జెక్టివ్‌ పరీక్షను దేశంలోని వివిధ నగరాల్లో నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌లో జరుగుతుంది. ప్రశ్నపత్రం హిందీ, 
ఇంగ్లిష్‌లో ఉంటుంది. వ్యవధి 90 నిమిషాలు. 

 • ప్రశ్నపత్రంలోని రెండు భాగాల్లో వంద ప్రశ్నలు ఉంటాయి. యాభై ప్రశ్నలు విద్యార్హతలకు సంబంధించిన సబ్జెక్టుల నుంచి ఇస్తారు. ప్రశ్నకు రెండు మార్కులు.
 • జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌ నుంచి యాభై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు. నెగటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. 
 • పరీక్ష తేదీని అడ్మిట్‌ కార్డ్‌ ద్వారా తెలియజేస్తారు. దీన్ని వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఈ సమాచారాన్ని ఈమెయిల్‌/ ఎస్‌ఎంఎస్‌కు తెలుపుతారు. 
 • ఆన్‌లైన్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:7 నిష్పత్తిలో పర్సనల్‌ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. 
 • ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులకు 3 టైర్‌ ఏసీ రైలు/ బస్‌ ఛార్జీలు చెల్లిస్తారు. 
 • ఆన్‌లైన్‌ టెస్ట్‌కు 80 శాతం, పర్సనల్‌ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇస్తారు. 
 • ఇంటర్వ్యూలో అర్హత సాధించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి, కేటగిరీలవారిగా తుది ఎంపిక చేస్తారు. 

సన్నద్ధత

విద్యార్హతలకు సంబంధించిన పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి. గతంలో చదివినవే కదా అనే నిర్లక్ష్య ధోరణి పనికిరాదు. ముఖ్యాంశాలను తప్పనిసరిగా పునశ్చరణ చేసుకోవాలి. 

 • జనరల్‌ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ నాలెడ్జ్‌/ అవేర్‌నెస్‌కు బ్యాంక్, ఎస్‌ఎస్‌బీ, ఆర్‌ఆర్‌బీ పోటీ పరీక్షల పాత ప్రశ్నపత్రాలను సాధన చేయొచ్చు. పరీక్ష వ్యవధిలోనే సమాధానాలు గుర్తించడానికి ప్రయత్నించాలి. 
 • ఆన్‌లైన్‌లో అందుబాటులో మోడల్‌ టెస్ట్‌లు రాయాలి. ఏయే అంశాల్లో వెనకబడి ఉన్నారో సమీక్షించుకుని.. వాటి మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. 

దరఖాస్తుకు చివరి తేదీ: 01.07.2024, 
వెబ్‌సైట్‌: www.rcfltd.com


నోటీస్‌బోర్డు

ప్రవేశాలు
ఎన్‌ఐటీ రవుర్కెలాలో ఎంఏ ప్రోగ్రామ్‌  

ఒడిశాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, రవుర్కెలా 2024-26 రెండేళ్ల విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రామ్‌లలో ఎంఏ ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది. 
విభాగాలు: హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌.

అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్, బీఏ, బీఎస్సీ, బీకాం లలో ఏదైనా కోర్సు పూర్తిచేయాలి. 

దరఖాస్తు ఫీజు: రూ.500.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూన్‌ 20
ఇంటర్వ్యూ తేదీ: జులై 05. ఫలితాలు: జులై 10.
కౌన్సెలింగ్, ప్రవేశాలు: జులై 15.
వెబ్‌సైట్‌: www.nitrkl.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని