కరెంట్‌ అఫైర్స్‌

 ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్‌ పూల ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందిన ఏ దేశంలో తులిప్‌ పూల రైతులు తెగుళ్ల బారిన పడిన ఈ పూల ఏరివేతకు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన రోబోలను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచారు?

Updated : 30 Apr 2024 03:15 IST

మాదిరి ప్రశ్నలు 

  •  ప్రపంచంలోనే అతిపెద్ద తులిప్‌ పూల ఉత్పత్తిదారుగా గుర్తింపు పొందిన ఏ దేశంలో తులిప్‌ పూల రైతులు తెగుళ్ల బారిన పడిన ఈ పూల ఏరివేతకు కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో రూపొందించిన రోబోలను ఉపయోగిస్తూ వార్తల్లో నిలిచారు?

(హెచ్‌2ఎల్‌ రోబోటిక్స్‌ లిమిటెడ్‌కు చెందిన ఎరిక్‌ డీ జోంగ్‌ కంపెనీ ఈ రోబోలను రూపొందించింది. ఏఐ రోబోలు తులిప్‌ తోటల్లో ఒక్కో సాలు (వరుస)కు గంటకు కిలోమీటరు వేగంతో నెమ్మదిగా కదులుతూ చీడపీడలను గుర్తిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.) 

జ: నెదర్లాండ్స్‌

  •  ఎంత మొత్తం వ్యయంతో 2025 కల్లా స్వదేశీ ఆయుధోత్పత్తికి 340 భారతీయ పరిశ్రమలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రధాన సైనికాధికారి జనరల్‌ మనోజ్‌ పాండే ఇటీవల ప్రకటించారు?

 జ: రూ.2.5 లక్షల కోట్లు

  • ఐ4సీ (ఇండియన్‌ సైబర్‌ క్రైమ్‌ కోఆర్డినేషన్‌ సెంటర్‌ - భారతీయ సైబర్‌ నేరాల సమన్వయ కేంద్రం) వెల్లడించిన లెక్కల ప్రకారం, 2021, ఏప్రిల్‌ నుంచి 2023, డిసెంబరు ముగిసే నాటికి దేశంలో సైబర్‌ ముఠాలు దోచుకున్న మొత్తం ఎంత?

(బాధితులు కోల్పోయిన మొత్తంలో రూ.1127 కోట్లను విజయవంతంగా స్తంభింపజేయగలిగినట్లు ఐ4సీ అధికారికంగా ప్రకటించింది. ఐ4సీకి కేటాయించిన ‘1930’కు వచ్చే ఫిర్యాదుల ఆధారంగా మోసగాళ్లు కొట్టేసిన సొమ్మును ఖాతాల్లో స్తంభింపజేస్తున్నారు?  

జ: రూ.10,319 కోట్లు

 విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి ఏ సంవత్సరం నాటికి వంద శాతానికి చేరాలని నూతన జాతీయ విద్యా విధానం - 2020 లక్షిస్తోంది?       

 జ: 2030

ఇటీవల వార్తల్లోకి వచ్చిన దీన బంధు చోటూ రామ్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?    

జ: హరియాణా  

ఏటా ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

జ:  ఫిబ్రవరి 10



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని