అనంత విశ్వంలో అద్భుత శక్తి!

Eenadu icon
By Features Desk Published : 28 Oct 2025 00:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

జనరల్‌ స్టడీస్‌
భౌతిక శాస్త్రం

గుండ్రంగా ఉన్న భూమిపై అందరూ ఎలా నిలబడగలుగుతున్నారు? మనుషులు లేదా వస్తువులకు బరువు ఏవిధంగా వస్తుంది? సూర్యుడి చుట్టూ గ్రహాలు, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉండటంలో రహస్యం ఏమిటి? భూమిపై మాత్రమే వాతావరణం ఎందుకు ఉంది? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం గురుత్వాకర్షణ బలం. ద్రవ్యరాశి, శక్తి ఉన్న వస్తువులన్నీ ఒకదానినొకటి ఆకర్షించుకోవడాన్నే గురుత్వాకర్షణ అంటారు. జీవుల శరీరాల నుంచి అనంత విశ్వం వరకు అదే సూత్రం వర్తిస్తుంది. పరిశీలిస్తే పరిసరాల్లో దాదాపు ప్రతి అంశానికీ ఆ అద్భుత ఆకర్షణశక్తి ఆధారమని అర్థమవుతుంది. ఆ బలం వెనుక ఉన్న ఆసక్తికరమైన భౌతికశాస్త్ర నియమాలను, సిద్ధాంతాలను పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. వస్తువు భారం, త్వరణాన్ని ప్రభావితం చేసే కారకాలు, న్యూటన్, గెలీలియో పరిశోధనల వివరాలు, వాటి ప్రాధాన్యంపై అవగాహన పెంచుకోవాలి. 


గురుత్వాకర్షణ బలం

విశ్వం ఒక అద్భుతం, అనంతం. గ్రహాలు, ఉపగ్రహాలు, ఆస్టరాయిడ్స్, ఉల్కలు, తోకచుక్కలు ఈ విధంగా ఎన్నో అందులో అమరి ఉన్నాయి.   వీటన్నింటి మధ్య ఏదో బలం పనిచేయకపోతే అవి స్థిరంగా ఉండవు. విశ్వంలో ప్రతి వస్తువు మరొకదాన్ని  ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ బలాన్నే  ‘గురుత్వాకర్షణ’ అంటారు. భూమి చుట్టూ చంద్రుడు; సూర్యుడి చుట్టూ గ్రహాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. అంటే అన్నిరకాల గ్రహాలు, ఉపగ్రహాలు,   ఆస్టరాయిడ్స్, తోకచుక్కలపై ఒక బలం పనిచేయాలి. అదే గురుత్వాకర్షణ బలం.

  • ఒక వస్తువును పైకి విసిరినప్పుడు అది నిర్దిష్ట ఎత్తుకు చేరుకుని తిరిగి కిందకు పడిపోతుంది. సర్‌ ఐజాక్‌ న్యూటన్‌ యాపిల్‌ చెట్టు కింద కూర్చున్నప్పుడు అతడిపై పడిన పండు ఆయనను ఆలోచింపజేసింది. యాపిల్‌ను భూమి ఆకర్షించినట్లే, చంద్రుడిని కూడా ఆకర్షిస్తుంది అనుకున్నాడు. ఈ సందర్భాల్లో ఒకే రకమైన బలం కారణమై ఉండవచ్చని భావించాడు.
  • చంద్రుడు తన కక్ష్యలోని ఒక బిందువు వద్ద ఒక సరళరేఖలో వెళ్లకుండా భూమి వైపు పడిపోతుందని న్యూటన్‌ వాదించాడు.
  • ఒక రాయిని దారంతో కట్టి చేతితో తిప్పుతుంటే అది నిర్దిష్ట వడితో ప్రతి బిందువు వద్ద దిశను మార్చుకుంటుంది. దిశలో మార్పు వల్లనే వేగంలో మార్పు ్బత్వరణం్శ కలుగుతుంది.

'


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని