స్వాతంత్య్రోద్యమ కాలంలోని ప్రముఖ వార్తాపత్రికలు

Eenadu icon
By Features Desk Published : 29 Oct 2025 01:23 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

స్టడీ జోన్‌

1780లో ప్రచురితమైన బెంగాల్‌ గెజెట్‌ పత్రిక

స్వాతంత్య్రోద్యమ సమయంలో నాయకుల ఆలోచనలను దేశ ప్రజలకు చాటిచెప్పడంలో.. జాతిని ఏకం చేయడంలో భారతీయ వార్తాపత్రికలు ముఖ్య పాత్ర పోషించాయి. బ్రిటిష్‌ వారి అకృత్యాలు, అన్యాయాలు, అణచివేతలు కళ్లకు కట్టేలా కథనాలు ప్రచురించాయి. వలస పాలనను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంగ్లేయుల విధానాలపైనే కాక, నాటి సమాజంలో పేరుకుపోయిన మూఢ విశ్వాసాలు, సామాజిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి ప్రజలను చైతన్యపరిచాయి. భిన్న మతాలు, జాతులు కలిగిన సమాజంలో ఐక్యతను పెంచి, జాతీయవాదాన్ని పెంపొందించడంలో సాయం చేశాయి. ముఖ్యంగా భారతీయులను ధైర్యవంతులను చేసి, నిరంకుశ పాలకులపై తిరగబడేలా ప్రోత్సహించాయి. దేశ స్వరాజ్య సిద్ధిలో ప్రముఖంగా నిలిచిన వార్తాపత్రికల గురించి పోటీపరీక్షల నేపథ్యంలో ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం..!

దేశంలో పత్రికల ప్రస్థానం.. 

మనదేశంలో మొదటి వార్తాపత్రిక బెంగాల్‌ గవర్నర్‌ జనరల్‌ వారెన్‌ హేస్టింగ్స్‌ పదవీకాలంలో ప్రచురితమైంది. ఐర్లాండ్‌కి చెందిన జేమ్స్‌ అగస్టస్‌ హిక్కీ 1780లో ‘ది బెంగాల్‌ గెజెట్‌’ పేరుతో దీన్ని ప్రారంభించారు. ఇది ఆసియాలోనే మొదటి వార్తా పత్రికగా పేరొందింది.   

  • 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటు దేశంలోని పత్రికల ముఖచిత్రాన్ని మార్చేసింది. అంతకుముందు ప్రచురితమైన పత్రికలు వినోదం, విజ్ఞానాలతోపాటు సాంఘిక, రాజకీయ సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాయి. 
  • 1857 తర్వాత భారతీయ పత్రికలు దేశంలో జాతీయత భావాలను పెంపొందించడం, దేశభక్తిని ప్రబోధించడం, బ్రిటిషర్ల అరాచకాలను - దోపిడీ విధానాలను ఎండగట్టడంపై ఎక్కువగా దృష్టిసారించాయి. 
  • 1905లో నాటి బ్రిటిష్‌ ప్రభుత్వంలో వైస్రాయ్‌గా ఉన్న లార్డ్‌ కర్జన్‌ బెంగాల్‌ రాష్ట్రాన్ని రెండుగా విభజించాడు. దానికి వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో అనేక పత్రికలు ప్రభుత్వ చర్యలను విమర్శిస్తూ, ఉవ్వెత్తున ఎగసిన ప్రజా ఉద్యమానికి మద్దతుగా నిలిచాయి.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు