హోమి జహంగీర్‌ బాబా

Eenadu icon
By Features Desk Published : 30 Oct 2025 00:53 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

శాస్త్రవేత్తలు విశేషాలు

ప్రఖ్యాత అణుభౌతిక శాస్త్రవేత్త. భారత్‌ను శాస్త్ర సాంకేతిక రంగంలో తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఈయన ఎంతో కృషి చేశారు. దేశ రక్షణ రంగ బలోపేతానికి హోమి జహంగీర్‌ బాబా అణ్వాయుధాల తయారీని మార్గంగా ఎంచుకుని, ఆ దిశగా పరిశోధనలు ప్రారంభించారు. ప్రస్తుతం భారత్‌ అణ్వాయుధాలు కలిగిన దేశంగా ఎదిగిందంటే ఈయన మార్గదర్శకత్వమే కారణం. దేశంలో అనేక శాస్త్ర విజ్ఞాన సంస్థలను ఏర్పాటు చేశారు. అక్టోబరు 30న హోమి జహంగీర్‌ బాబా జయంతి సందర్భంగా పోటీపరీక్షల నేపథ్యంలో ఆయన జీవితంలోని ముఖ్య విషయాల గురించి తెలుసుకుందాం..!

బాల్యం - వృత్తి జీవితం

హోమి బాబా 1909, అక్టోబరు 30న బొంబాయిలో జన్మించారు. కేథడ్రల్‌ అండ్‌ జాన్‌ కానన్‌ స్కూల్‌లో ప్రారంభ విద్యను అభ్యసించారు. 15 ఏళ్ల వయసులో ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో చదివేందుకు నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే అందులో ప్రవేశానికి వయసు అడ్డంకిగా మారడంతో బొంబాయిలోని ఎల్ఫిన్‌స్టోన్‌ కాలేజ్‌లో చేరారు. తర్వాత రాయల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌లో చేరి గణితం, భౌతికశాస్త్రంలో గ్రాడ్యుయేట్‌ డిగ్రీ పొందారు.

  • 1927లో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ చదివేందుకు ఇంగ్లండ్‌ వెళ్లారు. అక్కడ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని గోన్విల్లే అండ్‌ కైయస్‌ కాలేజీలో చేరారు. అక్కడ పనిచేసే ప్రముఖ బ్రిటిష్‌ ఫిజిసిస్ట్‌ పాల్‌ డిరాక్‌ ప్రభావంతో సైద్ధాంతిక భౌతికశాస్త్రంపై మక్కువ పెంచుకున్నారు. మెకానికల్‌ ఇంజినీరింగ్‌ని వదిలి తన అభ్యాసాన్ని థియరిటికల్‌ ఫిజిక్స్, గణితంపైకి మరల్చారు.
  • అదే సమయంలో కాస్మిక్‌ కిరణాలు, రేడియేషన్‌ను విడుదల చేసే కిరణాలపై ప్రయోగాలు చేశారు. తర్వాత ఆయన అణు భౌతికశాస్త్రంపై ఆసక్తి పెంచుకున్నారు.

అవార్డులు - గౌరవాలు

  • 1941లో రాయల్‌ సొసైటీలో ఫెలోగా నియమితులయ్యారు.
  •  1941లో ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌లో ఫెలోగా, ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌లో ఫిజిక్స్‌ విభాగానికి అధ్యక్షుడిగా నియమితులయ్యారు.
  • 1950లో ఐఏఎఫ్‌ఏ కాన్ఫరెన్స్‌కు భారతదేశం తరఫున బాబా ప్రాతినిధ్యం వహించారు. 
  •  1955లో జెనీవాలో జరిగిన యూఎన్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ది పీస్‌ఫుల్‌ యూజెస్‌ ఆఫ్‌ అటామిక్‌ ఎనర్జీకి అధ్యక్షుడిగా వ్యవహరించారు.
  •  1958లో అమెరికన్‌ అకాడమీ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌కు గౌరవ విదేశీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.

హోమి బాబాకు ఏ సంవత్సరంలో పద్మభూషణ్‌ లభించింది? ఆయన చేసిన పరిశోధనలు - ఇతర ముఖ్యాంశాల గురించి తెలుసుకోవడానికి క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి.

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు