ప్రపంచ నగరాల దినోత్సవం

Eenadu icon
By Features Desk Published : 31 Oct 2025 01:26 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

అక్టోబరు 31
చరిత్రలో ఈనాడు

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఏటా అక్టోబరు 31న ‘ప్రపంచ నగరాల దినోత్సవం’గా World Cities Day నిర్వహిస్తారు. దేశాభివృద్ధిలో పట్టణాలు కీలకపాత్ర పోషిస్తాయి. ఆర్థిక, రాజకీయ, పరిపాలనకు ఇవి కేంద్రాలుగా ఉన్నాయి. గ్రామాల నుంచి విద్య, ఉపాధి కోసం ఎక్కువగా వలస వెళ్తుండటంతో నగరాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో ఇక్కడ వనరులు తగ్గి, జనాభా పెరుగుతోంది. ఫలితంగా మౌలిక సదుపాయాలు, గృహనిర్మాణం, సామాజిక సేవలపై విపరీతమైన ఒత్తిడి ఏర్పడుతోంది. పట్టణీకరణ వల్ల తలెత్తే సవాళ్లను పరిష్కరించడంతోపాటు స్థిరమైన నగరాల అభివృద్ధికి దోహదపడటంలో దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

గ్లోబల్‌ లివబిలిటీ ఇండెక్స్‌ - 2025

ప్రజలు జీవించేందుకు అనువైన నగరాల జాబితాను 2025 జూన్‌లో ఇంగ్లండ్‌కి చెందిన ది ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఈఐయూ) సంస్థ విడుదల చేసింది. ఈ గ్లోబల్‌ లివబిలిటీ ఇండెక్స్‌ - 2025లో మొత్తం 173 నగరాలకు ర్యాంకులు ఇచ్చారు.

స్థిరత్వం (స్టెబిలిటీ), ఆరోగ్యం, సంస్కృతి - పర్యావరణం, విద్య, మౌలిక సదుపాయాలు మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ స్కోర్లను ప్రకటించారు.

చారిత్రక నేపథ్యం

ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ, నగరాల స్థిర అభివృద్ధిని ప్రోత్సహిస్తూ, దాని ద్వారా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి భావించింది. ఇందుకోసం ఒక రోజును ఏర్పాటు చేయాలనుకుంది. దీనికి అనుగుణంగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీ ఏటా అక్టోబరు 31న ప్రపంచ నగరాల దినోత్సవాన్ని జరుపుకోవాలని 2013, డిసెంబరు 27న తీర్మానించింది.

గ్లోబల్‌ లివబిలిటీ ఇండెక్స్‌ - 2025లో టాప్‌-3 నగరాలు ఏవి? ప్రపంచ నగరాల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు? తదితర సమాచారం కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని