ఎయిర్‌పోర్ట్ లేని దేశాల జాబితా
స్టడీ జోన్

దేశాభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయాల్లో విమానయాన రంగం ఒకటి. వాయుమార్గాల ద్వారా రవాణా అనేది వేగవంతమైన, ఖరీదైన విధానం. ఈ రంగం ఆధునిక ప్రపంచంలో రవాణాలో అనేక విప్లవాత్మక మార్పులు తెచ్చింది. ప్రయాణికులు, సరకుల తరలింపులో దేశాలను, దూరాలను దగ్గర చేస్తూ పర్యాటకం, వాణిజ్యం లాంటి ఎన్నో రంగాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు విమానయాన రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఎయిర్‌పోర్ట్స్ నిర్మాణం - విస్తరణ, కొత్త టెర్మినళ్ల ఏర్పాటు లాంటి అంశాలపై దృష్టి సారిస్తున్నాయి. అయితే ప్రపంచంలోని కొన్ని దేశాల్లో నేటికీ ఎయిర్‌పోర్టులు లేవు.. అక్కడ విమానాలు దిగలేవు. అవేంటో ఇవాళ్టి స్టడీ
జోన్‌లో చూసేద్దాం..!
భౌగోళిక అంశాలు, పరిమాణం, ఐసోలేషన్ కారణంగా కొన్ని దేశాల్లో నేటికీ విమానాలు సంచరించే వీలు లేదు. ఎయిర్‌పోర్టులు లేని దేశాలను పరిశీలిస్తే..
అండోరా: ఇది పశ్చిమ యూరప్‌లో ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల మధ్య పైరినీస్ పర్వతాల్లో ఉంది. రాజధాని అండోరా లా వెల్లా. ఎక్కువ భూభాగం పర్వతాలు, గుట్టలతో నిండి ఉండటం వల్ల విమానం టేకాఫ్‌కు రన్ వే కష్టంగా ఉంటుంది.
మొనాకో: పశ్చిమ యూరప్‌లోని ఫ్రెంచ్ రివేరాలో ఉంది. ఇది మూడు వైపులా ఫ్రెంచ్‌తో సరిహద్దు పంచుకుంటుంది. నాలుగో వైపు మధ్యధరా సముద్రం ఉంది. విస్తీర్ణం 2.1 చ.కి.మీ.
లీచ్టెన్‌స్టెయిన్: మధ్య ఐరోపాలో స్విట్జర్లాండ్, ఆస్ట్రియా దేశాల మధ్య ఉంది. తక్కువ పరిమాణం, పర్వత భూభాగం, చదునైన నేల తక్కువగా ఉండటంతో ఇక్కడ విమానాశ్రయం లేదు.
శాన్ మారినో: దక్షిణ ఐరోపాలో అపెనైన్ పర్వతాల ఈశాన్య భాగంలో ఇటాలియన్ ద్వీపకల్పంలో ఉంది. దేశం పర్వత ప్రాంతంలో, తక్కువ వైశాల్యంలో ఉండటం, విమానాలు తిరిగేందుకు అవసరమైన రన్ వే లేకపోవడం లాంటి కారణాల వల్ల ఇక్కడ ఎయిర్‌పోర్ట్ లేదు.
వాటికన్ సిటీ: ఇటలీలోని రోమ్‌లో ఉంది. తక్కువ వైశాల్యం కారణంగా ఎయిర్‌పోర్ట్ కట్టడం అసాధ్యం

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలుగు సీరియల్ నటికి లైంగిక వేధింపులు.. నిందితుడు అరెస్ట్
 - 
                        
                            

యువతిపై గ్యాంగ్ రేప్: ఎయిర్ పోర్ట్ వద్ద నిందితులపై ఎన్కౌంటర్
 - 
                        
                            

‘పాక్ సైన్యం ఓ కిరాయి మాఫియా’
 - 
                        
                            

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే.. మా సహకారం ఉండదు: అమెరికాకు తేల్చిచెప్పిన ఇరాన్
 - 
                        
                            

వడ్ల లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు
 - 
                        
                            

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
 


