ఇంజినీరింగ్ అయ్యాక ఏ కోర్సులో..?

గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెకానికల్ చదువుతున్నాను. తరువాత ఇంజినీరింగ్‌లో చేరాలనుంది. ఏ ప్రోగ్రాముల్లో నాకు చేరే అవకాశముంటుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది?

Published : 15 Jan 2016 17:10 IST

ఇంజినీరింగ్ అయ్యాక ఏ కోర్సులో..?

గవర్నమెంట్‌ పాలిటెక్నిక్‌ కళాశాలలో మెకానికల్‌ చదువుతున్నాను. తరువాత ఇంజినీరింగ్‌లో చేరాలనుంది. ఏ ప్రోగ్రాముల్లో నాకు చేరే అవకాశముంటుంది? భవిష్యత్తు ఎలా ఉంటుంది? - జి. రమేష్‌

మీకు ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ చదివే అవకాశం ఉంటుంది. మెకానికల్‌, మైనింగ్‌, ప్రొడక్షన్‌, ఆటోమొబైల్‌, మెటలర్జీ, ఏరోనాటికల్‌, మెటీరియల్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌, రోబోటిక్స్‌ మొదలైన కోర్సులు చదివే అవకాశముంటుంది. పాలిటెక్నిక్‌ తర్వాత ఇంజినీరింగ్‌ చేస్తే చాలా ఉద్యోగాలకు అర్హులవుతారు. విషయ పరిజ్ఞానం కూడా పెరగడం వల్ల పాలిటెక్నిక్‌లో నేర్చుకున్న ప్రాక్టికల్స్‌, ఇంజినీరింగ్‌లో నేర్చుకునే థియరీ, ప్రాక్టికల్స్‌ వల్ల అవగాహన, సమస్యా పరిష్కార సామర్థ్యాలు పెరుగుతాయి. ఫలితంగా మంచి భవిష్యత్తు సొంతమవుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని