పీజీ ప్రకటనలు ఎప్పుడొస్తాయి?

*2017-18 విద్యాసంవత్సరానికి హైదరాబాద్‌లో ఐఎఫ్‌ఎల్‌యూ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల పీజీ నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి?

Published : 02 Jan 2017 01:43 IST

పీజీ ప్రకటనలు ఎప్పుడొస్తాయి?

*2017-18 విద్యాసంవత్సరానికి హైదరాబాద్‌లో ఐఎఫ్‌ఎల్‌యూ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల పీజీ నోటిఫికేషన్లు ఎప్పుడు వెలువడతాయి?

- జి. ప్రశాంత్‌, గోధూర్‌, జగిత్యాల జిల్లా.

* విశ్వవిద్యాలయాల నోటిఫికేషన్లు వాటి ప్రవేశ విధానాన్ని బట్టి ఉంటాయి. కొన్ని కేవలం రాత పరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తాయి. మరికొన్ని రాతపరీక్షతో పాటుగా ఇంటర్వ్యూ, గ్రూప్‌ డిస్కషన్‌ లాంటి పరీక్షల ద్వారా ప్రవేశాన్ని కల్పిస్తాయి. కాబట్టి కొన్ని ముందుగా ప్రకటన విడుదల చేస్తే కొన్ని ఆలస్యంగా విడుదల చేస్తాయి.

* హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజ్‌ యూనివర్సిటీలో పీజీ కోర్సులకు నోటిఫికేషన్‌ ఏప్రిల్‌/మే నెలల్లో వెలువడుతుంటుంది. ప్రత్యేక రాతపరీక్ష ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు.

* హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం పీజీ కోర్సులకు ఏప్రిల్‌లో ప్రకటన విడుదల చేస్తుంది. వీరు కూడా రాతపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తారు. అయితే ఎంబీఏ కోర్సుకు 2017-18 ప్రవేశాల కోసం ఈ ఏడాది సెప్టెంబరులోనే ప్రకటన వెలువడింది. ఈ కోర్సు చదవాలనుకునేవారికి క్యాట్‌ స్కోరు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. క్యాట్‌ స్కోరుతో పాటు గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ మార్కులను కూడా పరిగణనలోకి తీసుకుంటారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని