మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తే..?

బీటెక్‌ (మైనింగ్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకున్న ఉద్యోగావకాశాలను....

Published : 07 Dec 2017 01:58 IST

మైనింగ్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేస్తే..?

బీటెక్‌ (మైనింగ్‌) చివరి సంవత్సరం చదువుతున్నాను. నాకున్న ఉద్యోగావకాశాలను వివరించండి. అది పూర్తయ్యాక ఏం చేస్తే భవిష్యత్తు బాగుంటుంది?

- కాసుల హిమవంశీ

జ: మైనింగ్‌ ఇంజినీరింగ్‌ దేశవిదేశాల్లో మంచి ఉద్యోగ, విద్యావకాశాలను కల్పిస్తోంది. మైనింగ్‌ ఇంజినీర్‌గా ప్రొడక్షన్‌ టార్గెట్‌ను సాధించడానికి మిషనరీ, మాన్‌ పవర్‌పై మీకు ఆధిపత్యం ఉంటుంది. ఎక్స్‌ప్లోజివ్స్‌ సెక్టార్‌లో సేల్స్‌ ఇంజినీర్‌ ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు. ఆయిల్‌ ఇండియా, ఆయిల్‌ రిగ్స్‌, గెయిల్‌ వంటి పీఎస్‌యూ సంస్థల్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉన్నతవిద్య పరంగా.. జీఆర్‌ఈ స్కోరు ఆధారంగా విదేశాల్లో ఎంఎస్‌ చేయవచ్చు. మీ కోర్సు పరంగా ఐఐటీ, ఎన్‌ఐటీ విద్యార్థుల నుంచి పోటీ ఎక్కువగా ఉంటుంది. మీరు వీటిల్లో చదివుండకపోయుంటే ఉన్నతవిద్యను ఎంచుకోవడం మేలు. ఉద్యోగపరంగా అయితే మనదేశంలోనూ, గల్ఫ్‌ దేశాల్లోనూ ఈ కోర్సు చదివినవారికి గిరాకీ ఎక్కువ.

* ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని